దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఎవరిని వదిలి పెట్టడం లేదు.ఈ విషయం తెలిసి కూడా దాదాపుగా ఎవరు తగినంతగా శ్రద్ద వహించడం లేదని అర్ధం అవుతుంది.
అందువల్ల పెరుగుతున్న కరోనా విషయంలో దీని కట్టడికి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టక తప్పడం లేదు.
ఇకపోతే ఈ మధ్య కాలంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న నేతలు, కార్యకర్తలు ఎక్కువగా కోవిడ్ బారిన పడుతున్న విషయం తెలిసిందే.
తాజాగా తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో ప్రచారం నిర్వహించిన డీఎంకే ఎంపీ కనిమొళి కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.ఈ మేరకు ఎంపీ అధికారికంగా ప్రకటించారు.
ఇక ఇటీవల తనను కలిసిన వారంతా కొవిడ్ టెస్టులు చేయించుకోవాలని కనిమొళి సూచించారు.ఇకపోతే తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నందు వల్లే కనిమొళికి కరోనా వ్యాపించి ఉండొచ్చని పార్టీ నాయకత్వం భావిస్తోందట.
ఏది ఏమైన కరోనా ఉన్నదన్న భయం లేకుండా ఇలా బహిరంగ సమవేశాలు నిర్వహిస్తే గెలవడం మాట పక్కన పెడితే కరోనా పట్టుకోవడం మాత్రం ఖాయం.