న్యూస్ రౌండప్ టాప్ 20

1.చంద్రబాబుకు ప్రాణ హాని

Telugu Ambati Ram Babu, Ap Bandh, Ap, Chandrababu, Chikoti Praveen, Cpi Yana, Ha

టిడిపి అధినేత మాజీ సీఎం చంద్రబాబు అరెస్టుపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లుద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబుకు ప్రాణహాని ఉందని, ఆయన జైల్లో ఉంచడం ప్రమాదమని చెప్పారు.

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Tdp, Chandr-TeluguStop.com

2.చంద్రబాబు అరెస్టుపై రాఘవులు కామెంట్

టిడిపి మీద చంద్రబాబు అరెస్టుపై సిపిఎం సభ్యులు బివి రాఘవులు స్పందించారు .అవినీతికి పాల్పడినట్లు ఆధారాలు ఉంటే చంద్రబాబునైనా, జగన్ నైనా అరెస్టు చేయాల్సిందేనని అన్నారు.

3.లోకేష్ తో మాట్లాడిన సిపిఐ రామకృష్ణ

Telugu Ambati Ram Babu, Ap Bandh, Ap, Chandrababu, Chikoti Praveen, Cpi Yana, Ha

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో సిపి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఫోన్లో మాట్లాడారు.చంద్రబాబు అక్రమ అరెస్ట్ ఊహించని ఘటనని అన్నారు.సిఐడి పోలీసులు దుర్మార్గమని అంటూ మనోధైర్యంతో నిబ్బరంగా ఉండాలని లోకేష్ కు ఫోన్ లో తెలిపారు.

4.చంద్రబాబుపై ఏపీ సిఐడి మరో పిటిషన్

టిడిపి అధినేత చంద్రబాబుపై ఏసీబీ కోర్టులో ఏపి సీఐడి మరో రెండు పిటిషన్ లు దాఖలు చేసింది.అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో పిటి వారెంట్ పిటిషన్ వేయగా , స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో అవినీతికి పాల్పడ్డారంటూ నమోదు చేసిన కేసులో చంద్రబాబును కస్టడీ కోరుతూ మరో పిటిషన్ దాఖలు చేసింది.

5.గద్వాల ఎమ్మెల్యేకు ఊరట

Telugu Ambati Ram Babu, Ap Bandh, Ap, Chandrababu, Chikoti Praveen, Cpi Yana, Ha

గద్వాల్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి ఊరట లభించింది.ఆయన ఎన్నిక రద్దుపై  తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

6.దుర్గగుడి వద్ద రోడ్డుపై విరిగిపడిన కొండ చరియలు

గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలు కారణంగా విజయవాడ దుర్గ గుడి కేశఖండనశాల సమీపంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి.దీంతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

7.ఏసీబీ కోర్టుకు న్యాయవాది సిద్ధార్థ లుద్రా

Telugu Ambati Ram Babu, Ap Bandh, Ap, Chandrababu, Chikoti Praveen, Cpi Yana, Ha

స్కిల్ డెవలప్మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు తరఫున వాదనలు వినిపించిన సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూద్ర విజయవాడలోని ఏసీబీ కోర్టుకు చేరుకున్నారు.  చంద్రబాబుకు మెయిల్ కోరుతూ ఆయన పిటిషన్ వేయనున్నారు.

8.సంబరాలు చేసుకున్న ఏపీ మంత్రి రోజా

టిడిపి అధినేత చంద్రబాబు అరెస్ట్ పై ఏపీ మంత్రి రోజా సంబరాలు చేసుకున్నారు.

9.లోకేష్ పాద యాత్ర కు తాత్కాలిక విరామం

Telugu Ambati Ram Babu, Ap Bandh, Ap, Chandrababu, Chikoti Praveen, Cpi Yana, Ha

యువగళం పాదయాత్రకు టిడిపి ప్రధాన కార్యదర్శి లోకేష్ కొన్ని రోజుల పాటు విరామం ఇవ్వనున్నారు.

10.సంగారెడ్డిలో బిజెపి బహిరంగ సభ

నేడు సంగారెడ్డిలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ తదితరులు హాజరవుతారు.

11.బిజెపిలోకి చీకోటి ప్రవీణ్

Telugu Ambati Ram Babu, Ap Bandh, Ap, Chandrababu, Chikoti Praveen, Cpi Yana, Ha

చీకోటి ప్రవీణ్ బిజెపిలో ఈనెల 12న చేరనున్నారు.కేంద్రమంత్రి , తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరనున్నారు.

12.చంద్రబాబు తో కుటుంబ సభ్యుల ములాఖాత్ రద్దు

రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును ఈరోజు ఆయన కుటుంబ సభ్యులు కలుస్తారని ముందుగా వార్తలు వచ్చినా , ఆ ములాఖాత్ రద్దు అయ్యింది.

13.చంద్రబాబు అరెస్టుపై హరీష్ రావు కామెంట్స్

Telugu Ambati Ram Babu, Ap Bandh, Ap, Chandrababu, Chikoti Praveen, Cpi Yana, Ha

అప్పట్లో చంద్రబాబు ఐటి ఐటి అనేవాడు పాపం, చంద్రబాబు అరెస్ట్ ఇప్పుడు జైల్లో ఉన్నాడు అని మంత్రి హరీష్ అన్నారు.

14.చంద్రబాబు అరెస్టుపై అంబటి కామెంట్స్

టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టు కావడం బాధాకరమే అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.

15.తెలంగాణలో భారీ వానలు

Telugu Ambati Ram Babu, Ap Bandh, Ap, Chandrababu, Chikoti Praveen, Cpi Yana, Ha

వచ్చే ఏడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ లోని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

16.నేడు ఏపీ బంద్

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాష్ట్ర బంద్ కు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది.దీనికి జనసేన మద్దతు పలికింది.

17.చంద్రబాబు అరెస్ట్ పై సోము వీర్రాజు కామెంట్స్

Telugu Ambati Ram Babu, Ap Bandh, Ap, Chandrababu, Chikoti Praveen, Cpi Yana, Ha

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను ఏపీ బిజెపి మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఖండించారు.

18.పరిటాల శ్రీరామ్, సునీత అరెస్ట్

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ కు నిరసనగా ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్ష  చేపట్టిన పరిటాల శ్రీరామ్, సునీతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

19.కాళోజీ కుమారుడి మృతి

Telugu Ambati Ram Babu, Ap Bandh, Ap, Chandrababu, Chikoti Praveen, Cpi Yana, Ha

ప్రజా కవి కాళోజీ నారాయణరావు కుమారుడు రవి కుమార్ (68) మృతి చెందారు.

20.లోకేష్ ను పరామర్శించిన నారాయణ

స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో చంద్రబాబు నాయుడు రిమాండ్ కు తరలించిన సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ ఫోన్ కాల్ ద్వారా పరామర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube