అలబామా కాల్పులు : నిందితుడి కోసం వేట.. డబ్బు కోసమే మారణహోమమా?

అమెరికా( America )లో తుపాకీ కాల్పుల కారణంగా అమాయకులు బలవుతున్నారు.ఈ నెల ఆరంభంలో జార్జియాలోని ఓ స్కూల్‌లో 14 ఏళ్ల హైస్కూల్ విద్యార్ధి ఉన్మాదిలా మారి తరగతి గదిలోనే కాల్పులకు తెగబడి ఇద్దరు ఉపాధ్యాయులను, ఇద్దరు తొటి విద్యార్ధులను బలి తీసుకున్నాడు.

 Alabama Mass Shooting Was Paid And Targeted Attack : Report ,alabama Mass Shoot-TeluguStop.com

తాజాగా అలబామా ( Alabama )రాష్ట్రంలో శనివారం చోటు చేసుకున్న కాల్పుల ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.

శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఓ బార్‌లో కాల్పులు చోటు చేసుకున్నాయి.ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.17 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Telugu Alabama, Alabama Mass, America, Attack, Georgia, Machine Gun, Randall Woo

ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు పోలీసులు ఏ ఒక్కరినీ అరెస్ట్ చేయలేదు.అయితే ఇది డబ్బు కోసం జరిగిన ఘటనగానే వారు అనుమానిస్తున్నారు.ఈ షూటర్‌లను గుర్తించడం మా మొదటి ప్రాధాన్యతని బర్మింగ్‌హామ్ మేయర్ రాండాల్ వుడ్‌ఫిన్(Randall Woodfin ) చెప్పారు.

నగర పోలీస్ చీఫ్ స్కాట్ థర్మాండ్ మాట్లాడుతూ.బాధితుల్లో ఒకరిని మాత్రమే అగంతకుడు లక్ష్యంగా చేసుకుని ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.

ఘటనాస్థలి నుంచి 100 షెల్ కేసింగ్‌లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.సెమీ ఆటోమేటిక్ ఆయుధాలతో వేగంగా కాల్పులు జరపడానికి వీలుగా షూటర్లు.

మెషిన్ గన్ కన్వర్షన్ డివైస్‌లు ఉపయోగించవచ్చని స్కాట్ అభిప్రాయపడ్డారు.

Telugu Alabama, Alabama Mass, America, Attack, Georgia, Machine Gun, Randall Woo

ఫైవ్ పాయింట్స్ సౌత్ ఎంటర్‌టైన్‌మెంట్ డిస్ట్రిక్ట్‌లో శనివారం అర్ధరాత్రి కాల్పులు చోటు చేసుకున్నాయి.వీకెండ్‌లో సాధారణంగా రద్దీగా ఉండే రెస్టారెంట్‌లు, బార్‌లకు ఈ ప్రాంతం కేరాఫ్.ముగ్గురు బాధితుల్లో ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఫుట్‌పాత్‌పై చనిపోయినట్లు అధికారులు తెలిపారు.

నాల్గో పురుషుడు ఆసుపత్రిలో మరణించినట్లు పోలీసులు చెప్పారు.మృతులను బెస్సెమెర్‌కు చెందిన అనిత్ర హోలోమన్ (21), బర్మింగ్‌హామ్‌కు చెందిన తాజ్ బుకర్ (27), కార్లోస్ మెక్ కెయిన్ (27)గా గుర్తించారు.

మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది.గాయపడిన వారిలో నలుగురు బాధితుల పరిస్ధితి విషమంగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube