2025 సంక్రాంతి పండుగ అభిమానులకు ఎంతో స్పెషల్ అనే సంగతి తెలిసిందే.సంక్రాంతి కానుకగా ఇప్పటికే విశ్వంభర,( Vishwambhara ) బాలయ్య బాబీ సినిమా, వెంకీ అనిల్ రావిపూడి కాంబో మూవీ ఫిక్స్ అయ్యాయి.
ఈ సినిమాలతో పాటు సందీప్ కిషన్ మజాకా( Majaka ) కూడా ఇదే పండుగను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే.అయితే సంక్రాంతి లెక్కలు అంతకంతకూ మారిపోతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
గేమ్ ఛేంజర్( Game Changer ) సినిమా క్రిస్మస్ కు వచ్చే ఛాన్స్ లేదని ఈ సినిమా సంక్రాంతికి వచ్చే ఛాన్స్ ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఓటీటీ స్లాట్ వల్ల విశ్వంభర సినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పుకునే అవకాశాలు ఉన్నాయని భోగట్టా.
గేమ్ ఛేంజర్ సంక్రాంతి కానుకగా విడుదలైతే వెంకీ అనిల్ కాంబో మూవీ కూడా సంక్రాంతి రేసు నుంచి తప్పుకునే అవకాశాలు అయితే కచ్చితంగా ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
గేమ్ ఛేంజర్ సంక్రాంతి రేసులో చేరితే చాలా సినిమాల లెక్కలు మారిపోయే అవకాశం అయితే ఉందని సమాచారం అందుతోంది.అనిల్ వెంకీ కాంబో మూవీ టైటిల్ సంక్రాంతికి వస్తున్నాం కావడం ఆ సినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పుకోవడం సరైన నిర్ణయమేనా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.గేమ్ ఛేంజర్ సినిమా సక్సెస్ సాధించడం డైరెక్టర్ శంకర్ కు కీలకమనే సంగతి తెలిసిందే.
సంక్రాంతి పండుగ సమయానికి మరికొన్ని సినిమాలు అధికారికంగా రేసులో చేరే ఛాన్స్ ఉంది.సంక్రాంతి సినిమాలకు( Sankranti Movies ) థియేటర్ల విషయంలో సైతం ఇబ్బందులు తప్పవని కామెంట్లు వినిపిస్తున్నాయి.సంక్రాంతి సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.సంక్రాంతి సినిమాలలో ఎన్ని సినిమాలు హిట్ గా నిలుస్తాయనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుండటం గమనార్హం.
సంక్రాంతి సినిమాలపై అంచనాలు పెరుగుతున్నాయి.