గీతాంజలి సినిమాలో గిరిజ చెల్లెలు టాప్ హీరోయిన్ అని మీకు తెలుసా?

గీతాంజలి, శివ సినిమాలు అక్కినేని నాగార్జున కెరీర్ ని మలుపు తిప్పిన సినిమాలు.గీతాంజలి సినిమా నాగ్ ని క్లాస్ ఆడియన్స్ కు దగ్గర చేస్తే, శివ సినిమా మాస్ ఆడియన్స్ కు దగ్గర చేసింది.

 Geethanjali Movie Child Artist Turns Heroine, Girija, Neena, Nagarjuna, Geethanj-TeluguStop.com

శివ సినిమా ట్రెండ్ సెట్టర్ గా నిలవడమే కాకుండా నాగ్ కి మాస్ ఇమేజ్ ని తెచ్చిపెట్టింది.గీతాంజలి రిలీజైన 5 నెలల తర్వాత శివ సినిమా రిలీజైంది.

ఈ సినిమాకి ముందే గీతాంజలి సినిమాతో నాగ్ తెలుగు సినిమా ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు.ఈ సినిమాతోనే నాగ్ కి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.

ఈ సినిమాని డైరెక్ట్ చేసిన మణిరత్నంకి కూడా తెలుగులో భారీ ఫాలోయింగ్ ఏర్పడింది.ఈ సినిమాకి ఇళయరాజా సంగీత సారధ్యం వహించారు.

అద్భుతమైన మెలోడీ సాంగ్స్ తో యూత్ ని ఉర్రూతలూగించారు.ఈ సినిమాని తమిళ్, మలయాళ భాషల్లో డబ్ చేయగా అక్కడ కూడా బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.

హిందీలో ఈ మూవీని “యాద్ రకేగీ దునియా” పేరుతో రీమేక్ చేశారు.అది కూడా హిట్ అయ్యింది.అయితే ఈ తెలుగు వెర్షన్ గీతాంజలి సినిమాలో అద్భుతమైన నటనతో నాగార్జున, హీరోయిన్ గిరిజ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.ఈ సినిమాకి బెస్ట్ పాపులర్ ఫిల్మ్ కేటగిరీలో జాతీయ అవార్డ్ దక్కింది.

బెస్ట్ డైరెక్టర్ గా మణిరత్నంకు సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కగా, బెస్ట్ స్టోరీ రైటర్ గా నంది అవార్డు దక్కింది.బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఒక నంది అవార్డు, బెస్ట్ సినిమాటోగ్రాఫర్ గా పి.సి.శ్రీరామ్ కు నంది అవార్డు వరించాయి.

Telugu Annamali, Geethanjali, Girija, Kannathai, Maniratnam, Nagalingam, Nagarju

ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ సినిమాలో నాగార్జున, గిరిజలతో పాటు మరో బాల నటి కూడా నటించింది.ఆమె పేరు నీనా పిళ్లై. గీతాంజలి సినిమాలో గిరిజ చెల్లిగా నటించారు.ఈ మూవీలో నాగార్జున, గిరిజల ప్రేమకు సపోర్ట్ చేసే కేరెక్టర్ లో భలే అద్భుతంగా నటించింది.బుడి బుడి అడుగులు వేస్తూ, ఈమె మాట్లాడే మాటలు, చేసే పనులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.గీతాంజలి సినిమాలో ఈ బేబీ పాత్ర కూడా హైలైట్ గా నిలిచింది.

ఈమె 1982 అక్టోబర్ 2 న చెన్నైలో జన్మించింది.ఆరేళ్లకే చైల్డ్ ఆర్టిస్ట్ అయిన నీనా, ఆ తర్వాత తమిళ సినిమాలకే పరిమితం అయ్యారు.

సినిమాల్లోనే కాకుండా పలు టి‌వి సీరియల్స్ లోనూ నటించింది.ఈమె తండ్రి రాజన్, తల్లి రాహిని.

గీతాంజలి తర్వాత కెలడి కన్మని, కాలమెల్లం కాతిరుప్పెన్, రాశి వంటి తమిళ సినిమాల్లో నటించారు.అయితే ఈమె నటనకి ఇంప్రెస్ అయిన పలు దర్శక, నిర్మాతలు హీరోయిన్ గా ఆఫర్లు ఇస్తే ఈమె సున్నితంగా తిరస్కరించారట.

ఆ తర్వాత 1997 లో కె.బాలచందర్ నిర్మాతగా వచ్చిన విడుకథై సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం వస్తే ఒప్పుకున్నారు.ఈ సినిమాతో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.తన పాత్రని అద్భుతంగా పండించారని, ఎక్స్ లెంట్ యాక్టింగ్ అంటూ ప్రశంసించారు.

ఆ తర్వాత కన్నతై, నాగలింగం సినిమాల్లో లీడ్ రోల్స్ లో నటించిన నీనాకి, సుదందిరం సినిమానే లాస్ట్ సినిమా.దీని తర్వాత ఆమె సినిమాలు చేయడం మానేశారు.

సినిమాల కంటే సీరియల్స్ లో నటించేందుకు ప్రాముఖ్యత ఇచ్చారు.అలా ఈమె పెన్, జెయుపాతు నేజం, చితి, అన్నామలై, వరం వంటి సీరియల్స్ లో నటించారు.

ఆ తర్వాత 2004 లో చందిల్ అనే వ్యక్తిని వివాహం చేసుకుని ఆస్ట్రేలియాలోని, మెల్ బార్న్ లో సెటిల్ అయ్యారు.వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

అమ్మాయి పేరు సోనియా, అబ్బాయి పేరు సంజయ్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube