ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి బలమైన జిల్లాగా ఉన్న అనంతపురంలో నాయకులు చాలా మందే ఉన్నారు.అయితే.
ఇటీవల కాలంలో ప్రముఖంగా కనిపిస్తున్న, వినిపిస్తున్న పేరు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు దే.పార్టీ తరఫున ఏ కార్యక్రమం నిర్వహించినా.ఎక్కడ ఎలాంటి నిరసన తెలిపినా.కాల్వ దూకుడుగా వ్యవహరిస్తున్నారు.వాస్తవానికి కొన్నాళ్ల కిందట ఆయన వైసీపీలోకి వెళ్లిపోతారనే ప్రచారం జరిగింది.అయితే.
ఏమైందో ఏమో.ఆయన టీడీపీలో నే కొనసాగుతున్నారు.
ఈ క్రమంలోనే చంద్రబాబు కాల్వకు అనంతపురం పార్లమెంటు ఇంచార్జ్ పదవిని అప్పగించారు.ఇక, అప్పటి నుంచి దూకుడుగా వ్యవహరిస్తున్నారు కాల్వ.ప్రతి కార్యక్రమాన్నీ అట్టహాసంగా నిర్వహిస్తున్నారు.చంద్రబాబు పిలుపు మేరకు ప్రతి కార్యక్రమాన్నీ సక్సెస్ చేస్తున్నారు.
ఇంతవరకు బాగానే ఉన్నా.వర్గ పోరుకు కేంద్రంగా ఉన్న జిల్లాలో.
టీడీపీని ఆశించిన విధంగా నడిపించగలరా? అనేదే ఇప్పుడు కీలకంగా మారింది.కాల్వ దూకుడుగా వ్యవహరిస్తున్నా.
మరోవైపు జేసీ, పరిటాల కుటుంబాలు సహా .అనేక మంది యాక్టివ్‌గా ఉండలేకపోతున్నారు.

ఇక, పలు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది.ముఖ్యంగా ధర్మవరం, పెనుకొండ, అర్బన్ నియోజకవర్గాల్లో పార్టీ ఆశించిన మేరకు పుంజుకోవడం లేదు.నాయకులు ఉన్నా.కలిసి రావడం లేదు.ఒకవైపు కాల్వ అందరినీ కలుపుకొని పోవాలని ప్రయత్నిస్తున్నా.ఈగో సమస్య వెంటాడుతోంది.
దీంతో కాల్వ పరిస్థితి డోలాయమానంలో పడింది.
పార్టీని ముందుకు నడిపించాలని ఉన్నా.
సహకరించని నాయకులతో ఆయన కలిసి సాగలేకపోతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది.ఇక, గెలిచిన ఇద్దరు నాయకులు బాలకృష్ణ, పయ్యావుల కేశవ్‌లు.
ఇద్దరూ కూడా ఎవరి దారి వారిదే.అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.
బాలయ్య చాలా రోజుల తర్వాత ఇప్పుడే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.కనీసం జిల్లాలో అప్పుడుప్పుడు పర్యటించినా కాల్వలో కూడా కొత్త ఉత్సాహం వస్తుంది.
బాలయ్య, కేశవ్ లాంటి వాళ్లు ఎమ్మెల్యేలుగా ఉన్నా కలిసి రాక కాల్వ అనంతలో టెన్షన్ టెన్షన్‌గా రాజకీయం చేయాల్సిన పరిస్థితి.