మీ పిల్లలు పాలు అస్సలు తాగడం లేదా.. అయితే ఇలా చేయండి?

పిల్లల ఎదుగుదలకు దోహదపడే పోషకాల్లో కాల్షియం( Calcium ) ఒకటి.కాల్షియం బలమైన ఎముకల నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుంది.

 What Foods Can Be Given To Children Instead Of Milk? Children, Milk, Calcium Ric-TeluguStop.com

కాల్షియం కు గొప్ప మూలం పాలు.అందుకే పిల్లల చేత తల్లులు ఉదయాన్నే ఒక గ్లాస్ పాలు తాగిస్తుంటారు.

అయితే కొందరు పిల్లలు పాలు తాగడానికి అస్సలు ఇష్టపడరు.రోజు మిల్క్ ను స్కిప్‌ చేస్తుంటారు.

ఈ జాబితాలో మీ పిల్లలు ఉన్నారా.? అయితే మీరు పాలుకు ప్రత్యామ్నాయాల‌ను ఎంచుకోండి.

Telugu Almonds, Calcium, Chia Seeds, Tips, Latest, Milk, Orange-Telugu Health

పిల్లల చేత పాలను బలవంతంగా తాగించడం కంటే దానికి బదులుగా కాల్షియం రిచ్ గా ఉండే వేరే ఆహారాలను వారితో తినిపించడం చాలా ఉత్తమం.పాలు కాకుండా కాల్షియం పుష్కలంగా ఉండే కొన్ని ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఆరెంజ్ పండ్లు.‌.పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.అయితే ఆరెంజ్ పండ్లలో( Orange ) విటమిన్ సి మాత్రమే కాదు కాల్షియం కూడా మెండుగా ఉంటుంది.

కాబట్టి మీరు పిల్లల చేత రోజుకు ఒక ఆరెంజ్ ను తినిపించండి.

Telugu Almonds, Calcium, Chia Seeds, Tips, Latest, Milk, Orange-Telugu Health

చియా సీడ్స్( Chia Seeds ).వీటి పరిమాణం చిన్నగా ఉన్నా అనేక రకాల విటమిన్స్, మినరల్స్ ను కలిగి ఉంటాయి.ముఖ్యంగా చియా సీడ్స్ లో కాల్షియం రిచ్ గా ఉంటుంది.

కాబట్టి మీరు పిల్లలకు చియా సీడ్స్ ను పెరుగు, స్మూతీస్, ఓట్ మీల్ వంటి ఫుడ్స్‌లో కలిపి ఇస్తే చక్కగా తినేస్తారు.పుట్టగొడుగులు లేదా మష్రూమ్స్.చాలా మంది ఫేవరెట్ ఫుడ్ గా చెప్పుకోవచ్చు.అయితే పుట్టగొడుగులు పాలు కంటే అధిక కాల్షియం ను కలిగి ఉంటాయి.

అందుకే పిల్లలకు వారంలో ఒకటి లేదా రెండు సార్లైనా పుట్టగొడుగుల వంటల‌ను రుచి చూపించండి.అలాగే మీ పిల్లలు పాలు తాగడం లేదంటే తప్పకుండా ఉదయం ఐదు నానబెట్టిన బాదం పప్పులను వారి చేత తినిపించండి.

బాదం పప్పులో కూడా కాల్షియం పుష్కలంగా ఉంటుంది.బ్రోకలీ, పాలకూర, సోయా ఉత్పత్తులు, చిలగడదుంప, గుడ్డు వంటి ఆహారాల్లోనూ కాల్షియం ఉంటుంది.

కాబట్టి మీ పిల్లలు పాలు స్కిప్ చేస్తుంటే దానికి బదులుగా ఇప్పుడు చెప్పుకున్న ఆహారాలను వారి డైట్ లో చేర్చండి.తద్వారా వారిలో క్యాల్షియం కొరత తలెత్తకుండా ఉంటుంది.

పిల్లల శారీరక మానసిక ఎదుగుదల కూడా అద్భుతంగా సాగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube