పనిగట్టుకుని మరీ వచ్చి మనశ్శాంతిని దూరం చేసే చర్మ సమస్యల్లో మొటిమలు ముందు వరసలో ఉంటాయి.జంక్ ఫుడ్ ను అధికంగా తీసుకోవడం, ఒత్తిడి, హార్మోన్ చేంజ్, నిద్రను నిర్లక్ష్యం చేయడం, మేకప్ తో నిద్రించడం, చుండ్రు తదితర కారణాల వల్ల మొటిమలు తరచూ వేధిస్తూ ఉంటాయి.
వాటిని వదిలించుకోవడం కోసం ముప్ప తిప్పలు పడుతుంటారు.ఒక్కోసారి మొటిమలు అంత సులభంగా పోవు.
అయితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ వేపాకుల సీరంను వాడితే ఎలాంటి మొండి మొటిమలైనా రెండు రోజుల్లో మాయమవుతాయి.మరియు మొటిమల తాలూకు మచ్చలు సైతం దూరమవుతాయి.
మరి ఇంతకీ వేపాకుల సీరంను ఎలా తయారు చేసుకోవాలి.? అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా గుప్పెడు వేపాకులను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో ఒక కప్పు కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి.
ఆ తర్వాత స్టైనర్ సహాయంతో రైస్ వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.
ఈ రైస్ వాటర్ ను పూర్తిగా చల్లారబెట్టుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో ఫ్రెష్ వేపాకులు మరియు రైస్ వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఈ జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్, నాలుగు చుక్కలు టీట్రీ ఎసెన్షియల్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేస్తే వేపాకుల సీరం సిద్ధమవుతుంది.
ఈ సీరంను ఒక బాటిల్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.ఉదయం స్నానం చేయడానికి గంట ముందు మరియు నైట్ నిద్రించడానికి గంట ముందు ఈ వేపాకుల సీరం ను ముఖం మొత్తానికి అప్లై చేసుకోవాలి.రోజుకో రెండు సార్లు ఈ సీరంను వాడితే మొటిమలు రెండు రోజుల్లో తగ్గుముఖం పడతాయి.
మరియు వాటి తాలూకు మచ్చలు సైతం పారర్ అవుతాయి.