వర్షాకాలంలో బొప్పాయిని నిత్యం తినాలి.. ఎందుకు తెలుసా?

వర్షాకాలం రానే వచ్చింది.అనేక ప్రాంతాల్లో జోరుగా వర్షాలు ఆగ‌కుండా కురుస్తున్నాయి.

 Why Eating Papaya Daily During Monsoon Season, Papaya, Papaya Health Benefits-TeluguStop.com

ఈ వర్షాకాలంలో ఆరోగ్యం పట్ల అధిక శ్రద్ధ వహించడం ఎంతో అవసరం.ముఖ్యంగా డైట్ లో ఏది పడితే అది చేర్చితే రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది.

దీంతో జబ్బులు సులభంగా ఎటాక్ చేస్తాయి.అందుకే ఇమ్యూనిటీ సిస్టమ్ ని స్ట్రాంగ్ గా మార్చుకునేందుకు ప్రయత్నించాలి.

అందుకు కొన్ని కొన్ని ఆహారాలు అద్భుతంగా సహాయపడతాయి.అటువంటి వాటిలో బొప్పాయి పండు ఒకటి.

నిజానికి వర్షాకాలంలో బొప్పాయి పండును నిత్యం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.బొప్పాయి పండులో విటమిన్ సి మెండుగా ఉంటుంది.

ఇది మీ రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుంది.దీంతో అనేక సీజనల్ వ్యాధులు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

జలుబు,( Cold ) దగ్గు, జ్వరం వంటివి వేధించకుండా ఉంటాయి.ఒకవేళ అవి వచ్చినా చాలా త్వరగా వాటి నుంచి రికవరీ అయిపోతారు.

Telugu Tips, Latest, Monsoon, Monsoon Season, Papaya, Papaya Benefits-Telugu Hea

వర్షాకాలంలో చాలామంది ఫుడ్ పాయిజన్ కు గురవుతుంటారు ఎందుకంటే ఈ సీజన్ లో తినే ఆహారంతో పాటు తాగే నీటిలో సూక్ష్మజీవులు ఉంటాయి.అవి మన ఆరోగ్యాన్ని చెడగొడతాయి.అయితే బొప్పాయి పండును తీసుకుంటే అందులో ఉండే పలు సమ్మేళనాలు సూక్ష్మజీవులను అంతం చేస్తాయి, ఫుడ్ పాయిజ‌న్ కాకుండా ర‌క్షిస్తాయి.మన ఆరోగ్యానికి అండగా నిలుస్తాయి.వ‌ర్షాకాలంలో వ‌చ్చే డెంగ్యూ, మ‌లేరియా, టైఫాయిడ్ వంటి విష జ్వ‌రాల‌ను అడ్డుకునేందుకు బొప్పాయి పండు( Papaya ) ఎంత‌గానో సహాయపడుతుంది.

Telugu Tips, Latest, Monsoon, Monsoon Season, Papaya, Papaya Benefits-Telugu Hea

అంతేకాదు వర్షాకాలంలో నిత్యం బొప్పాయి పండును తీసుకుంటే హెల్తీ గా ఉంటారు.ఫిట్ గా మారతారు.ర‌క్త‌హీన‌త‌ ( Anemia )సమస్య దూరం అవుతుంది.

జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది.కంటి చూపు రెట్టింపు అవుతుంది.

మరియు చర్మ ఆరోగ్యం సైతం మెరుగుపడుతుంది.కాబట్టి వర్షాకాలంలో నిత్యం బొప్పాయి పండును తీసుకోండి.

అయితే అధిక మొత్తంలో తీసుకుంటే మాత్రం అనేక సమస్యలు త‌లెత్తుతాయి.ఎంత మంచిది అయినప్పటికీ బొప్పాయి పండు చాలా లిమిట్ గానే తీసుకోవాలి.

ఇది గుర్తుంచుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube