రిజర్వేషన్ల అంశంతో మొదలైన ఆందోళనలు బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా( Sheikh Hasin ) ప్రభుత్వం కూలిపోవడానికి దారి తీశాయి.ఆమె తన కొద్దిమంది అంతరంగికులతో కలిసి భారత్‌కు చేరుకుని ఇక్కడ తలదాచుకున్న సంగతి తెలిసిందే.
అక్కడితో అల్లర్లు ఆగడం లేదు.నిరసనకారులు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, లూటీలు, దోపిడీలు, హత్యలు చేస్తున్నారు.
అయితే ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల ముసుగులో మతపరమైన హింస జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.ముఖ్యంగా హిందువుల ఇళ్లు, ఆలయాలను అల్లరి మూకలు టార్గెట్ చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్, బంగ్లాదేశ్ పూజ ఉద్జపన్ పరిషత్ అనే రెండు హిందూ సంస్థల ప్రకారం.బంగ్లాదేశ్)( Bangladesh లోని మైనారిటీ కమ్యూనిటీల సభ్యులు ఆగస్ట్ 5న షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం పడిపోయినప్పటి నుంచి 52 జిల్లాల్లో కనీసం 205 దాడులను ఎదుర్కొన్నారు.
వేలాది మంది బంగ్లాదేశ్ హిందువులు హింస నుంచి తప్పించుకోవడానికి పొరుగున ఉన్న భారత్‌కు పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన భారత సంతతి చట్టసభ సభ్యులు బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై జరుగుతున్న దాడులను ఆపడానికి అమెరికా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.అక్కడి హిందువులపై జరుగుతున్న అకృత్యాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సభ్యుడు శ్రీథానేదర్( Shri Thanedar ) .ఆగస్ట్ 9న విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్‌కు లేఖ రాశారు.హింసకు గురైన బంగ్లా హిందువులు, ఇతర మతపరమైన మైనారిటీలకు శరణార్ధులుగా తాత్కాలిక రక్షిత హోదా ఇవ్వాలని థానేదర్ బైడెన్ పరిపాలన యంత్రాంగాన్ని కోరారు.
బంగ్లాదేశ్‌లో రాజకీయ హింస కొత్త విషయం కాదని.1971లో ఆవిర్భవించిన నాటి నుంచి ఆ దేశం అనేక తిరుగుబాట్లు, నాయకత్వ మార్పులను చూసిందన్నారు.అలాగే ఆ దేశంలో హిందూ జనాభాను లక్ష్యంగా చేసుకోవడం కూడా ఇప్పుడే కొత్త కాదని.
బంగ్లాదేశ్ జనాభాలో హిందువులు 8 శాతమన్నారు.మరో భారత సంతతి చట్టసభ సభ్యుడు రాజా కృష్ణమూర్తి కూడా ఆంటోనీ బ్లింకెన్‌కు లేఖ రాశారు.
బంగ్లాదేశ్‌లో హింసను అంతం చేయడానికి , బాధ్యులైన వారిని చట్టం ముందు నిలబెట్టడానికి అమెరికా జోక్యం చేసుకోవాలని కోరారు.