జంగల్ సఫారీ( Jungle Safari ) చాలా అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది.ఈ సఫారీకి వెళ్లినవారు చెట్ల మధ్య ప్రయాణించి, ప్రకృతిని దగ్గరగా చూడవచ్చు.
జంతువులను కూడా కొద్ది అడుగుల దూరం నుంచే చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు.ఈ సాహసయాత్రలో జంతువులను చూడాలని మనందరికీ ఉంటుంది.
ఏదైనా జంతువు కనిపించలేదంటే ఆ సఫారీ పూర్తి కాలేదనే ఫీలింగ్ కూడా వస్తుంది.అయితే కొంతమంది కేవలం యానిమల్స్ చూసి ఎంజాయ్ చేయకుండా వాటిని ముట్టుకోవడానికి ట్రై చేస్తారు.
దీని వల్ల ప్రమాదంలో పడుతుంటారు.ఇటీవల ఒక టూరిస్ట్ ( Tourist ) కూడా ఇలాంటి షాకింగ్ పని చేశాడు.
అతడికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అందులో ఈ వ్యక్తి సింహాన్ని( Lion ) చూసి దానిని తాకాలని ప్రయత్నిస్తున్నాడు.సింహం పడుకున్న చోటుకు దగ్గరగా ఒక జీప్ ఆగింది.అందులో కూర్చున్న ఈ టూరిస్ట్ భయపడకుండా అడవి రాజును తాకాలనే ఆలోచన చేశాడు.
అంతే కాదు తన చేతిని కారు విండో బయటకు పెట్టి సింహం వెనుక భాగాన్ని తాకాడు.జాగ్రత్తగా సింహాన్ని టచ్ చేసి, దాని ప్రవర్తన ఎలా ఉందో గమనిస్తున్నాడు.
జీప్ లో కూర్చున్న ఆ వ్యక్తి తన చేతిని కిటికీ బయటకు నెమ్మదిగా పెట్టి సింహాన్ని మెల్లగా తాకాడు.
సింహం కళ్లు మూసుకుని వాళ్ల కారు దగ్గరే పడుకుంది.అందుకే ఆ వ్యక్తి దానిని తాకాలని అనుకున్నాడు.మొదటిసారి తాకినప్పుడు సింహం పెద్దగా రియాక్ట్ కాలేదు.
కానీ కొన్ని సెకన్ల తర్వాత మళ్లీ తాకినప్పుడు సింహం తల తిప్పి చూసింది.చాలా వేగంగా దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా చూసింది.
సింహం అలా చేయడంతో ఆ వ్యక్తికి భయమేసింది.అతడి పిచ్చి పని వల్ల మిగతా వాళ్ళందరూ ఒక్క నిమిషం ప్రాణ భయంతో గజగజ వణికారు.
సింహం లేచి వాళ్ల వైపు చూడడంతో అందరూ కారు లోపలికి వెళ్లి నక్కారు.అదృష్టవశాత్తు సింహం కోపం తెచ్చుకోలేదు.
తిరిగి పడుకుని నిద్రపోయింది.
అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు అతడిని బాగా తిట్టిపోశారు.సరదా కోసం సింహాలతో ఆడుకుంటే చివరికి చచ్చిపోతావ్ అంటూ ఘాటుగా విమర్శించారు.“నీ పిచ్చి పనుల వల్ల ఇతరుల ప్రాణాలకి హాని కలుగుతుంద”ని మరికొంతమంది తీవ్రంగా విమర్శించారు.నువ్వు యమరాజుకు హాయ్ చెప్తున్నావు బ్రదర్, చావంటే ఎందుకంత తీపి ఇంకొంతమంది చివాట్లు పెట్టారు.ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.