ముఖంపై మచ్చలు, మొటిమలు లేకుండా అందంగా మెరుస్తూ కనిపించాలని అందరూ కోరుకుంటారు.కానీ, కోరుకున్న దానికంటే భిన్నంగా చర్మం ఉంటుంది.
దీంతో చర్మాన్ని కాంతివంతంగా మార్చుకునేందుకు మార్కెట్‌లో లభ్యమయ్యే క్రీములు, లోషజన్లు వంటి వేలకు వేలు ఖర్చు పెట్టి కొనుగోలు చేసి.వాడుతుంటారు.
అయినప్పటికీ ఫలితం లేకుంటే.ఖర్చు పెట్టిన డబ్బు మొత్తం బూడితలో పోసిన పన్నీరు అవ్వడం తప్ప ఏమి కాదు.
అందుకే న్యాచురల్ చర్మానికి మెరుగులు దిద్దుకోవాలని చెబుతుంటారు.
అయితే మచ్చల్లేని మెరిసే చర్మాన్ని అందించడంలో గుమ్మడి గింజలు అద్భుతంగా సహాయపడతాయి.
మరి గుమ్మడి గింజలు ఎలా ఉపయోగించాలి అన్నది లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా కొన్ని గుమ్మడి గింజలను తీసుకుని మొత్తగా పౌడర్ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో గుమ్మడి గింజల పౌడర్ మరియు పాలు తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.
ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి.అనంతరం చల్లటి నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.ముఖంపై నల్ల మచ్చలతో పాటు ముడతలు పోయి అందంగా మారుతుంది.

రెండొవది.ఒక బౌల్‌లో గుమ్మడి గింజల పౌడర్, తేనె మరియు రోజ్ వాటర్ వేసి బాగా కలుపుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.అరగంట ఆరనిచ్చి అనంతరం గోరు వెచ్చని నీటితో శుభ్రంగా వాష్ చేసుకోవాలి.ఇలా తరచూ చేయడం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది.అంతేకాకుండా, ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మంలో అదనపు నూనె ఉత్పత్తిని తగ్గించి మొటిమలను నివారిస్తుంది.
ఇక మూడొవది.ఒక బౌల్ తీసుకుని అందులో కొద్దిగా గుమ్మడి గింజల పొడి, చిటికెడు పసుపు మరియు వాటర్ వేసి కలుపుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.పావు గంట పాటు ఆరనిచ్చి అనంతరం గోరు వెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి.
ఇలా వారానికి మూడు సార్లు చేయడం వల్ల ముఖంపై మలినాలు పోయి.కాంతివంతంగా మెరుస్తుంది.