కివి పండ్లు( Kiwi fruits ) మన ఆరోగ్యానికి ఎంతో మంచివి.ఇందులోని పోషకాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.
అలాగే కివి పండులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి అధికంగా లభిస్తుంది.వీటిలో విటమిన్ బి, సి, కాపర్, ఫైబర్, పొటాషియం, ఫోలిక్ యాసిడ్ లాంటివి పుష్కలంగా లభిస్తాయి.
ఎండిన కివి క్రమం తప్పకుండా తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి పెంచడంలో సహాయపడుతుంది.అలాగే ఇవి పొటాషియం ను కలిగి ఉంటాయి.
కాబట్టి అధిక రక్తపోటు( High blood pressure )ను తగ్గించడానికి సహాయపడతాయి.అలాగే గుండె ఆరోగ్యానికి కూడా ఎండిపోయిన కివి చాలా మంచిది.

ఎందుకంటే ఇందులో విటమిన్ కె,ఇ, మెగ్నీషియం, ఫోలేట్ పుష్కలంగా లభిస్తాయి.ఇది ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది.అలాగే కంటి ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి.ఇవి మలబద్ధకం( Constipation ) నుండి ఉపశమనం కలిగిస్తాయి.జీర్ణ క్రియను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.
ఇక కివి పండులో గ్లైసేమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది.కాబట్టి ఇది మధుమేహం ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉంటుంది.
ఇక బరువు తగ్గాలనుకునే వారు కూడా ఎండిన కివిని ఆహారంలో తీసుకుంటే ఇందులో ఫైబర్ కలిగి ఉండడం వలన, ఇవి ఆకలిని నియంత్రించగలవు.

కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు వీటిని ఆహారంలో చేర్చుకోవడం వలన చాలా సులువుగా బరువు( Weight )తగ్గుతారు.అలాగే ఇందులో విటమిన్ సి, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.ఇవి చర్మ ఆరోగ్యానికి ( skin health )కూడా మంచివి.
వీటిని తరచుగా తినడం వలన అధిక రక్తపోటు సమస్యలను సులభంగా నియంత్రించుకోవచ్చు.దీంతో బిపి అదుపులో ఉంటుంది.
గుండె జబ్బులు ఉన్నవారికి ఇది చాలా మంచిది.ఇందులో ఉండే గుణాలు గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
కివిలో క్యాలరీ పరిమాణాలు చాలా తక్కువగా ఉంటాయి.కాబట్టి డయాబెటిక్ పేషంట్లకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
కివి పండు తినడం వలన శరీర టాక్సిన్స్ అన్నీ తగ్గిపోతాయి.చర్మం మరింత కాంతివంతంగా తయారవుతుంది.
చర్మంపై అద్భుతమైన గ్లో కూడా వస్తుంది.ఇక ముడతలు ఉన్నా కూడా తగ్గిపోతాయి.