గత వైసిపి( YCP ) ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేసిందని , ఫలితంగా ఆర్థిక వ్యవస్థ ఆస్తవ్యస్తవం అయ్యిందని , అనేక అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నాయని గత కొద్ది రోజులుగా టిడిపి, జనసేన, బిజెపి కూటమి విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే .వివిధ శాఖలకు సంబంధించి ఇప్పటికే అనేక శ్వేత పత్రాలను ఏపీ సీఎం చంద్రబాబు విడుదల చేశారు .
తాజాగా ఏపీ అప్పులపై తమపై వస్తున్న విమర్శలపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు.రాష్ట్ర హక్కులపై చంద్రబాబు( Chandrababu ) ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని జగన్ మండిపడ్డారు.
ఈరోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో( Tadepalli Camp Office ) మీడియా సమావేశం నిర్వహించిన జగన్ చంద్రబాబు పాలనపై విమర్శలు చేశారు.చంద్రబాబు పాలనలో రాష్ట్రం తిరోగమనవంలో వెళుతుందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 52 రోజుల్లో రాష్ట్రంలో అక్రమాలు , ఆకృత్యాలు పెరిగిపోయాయి అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
” 52 రోజులుగా దాడులు , అత్యాచారాలు, ఆస్తుల ధ్వంసం కొనసాగుతోంది.ప్రశ్నించే వాళ్లను అణిచివేస్తున్నారు.వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు.విధ్వంస పాలన సాగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు.బడ్జెట్ కూడా పెట్టలేని స్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉంది.పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే బాబు హామీలకు లెక్కలు చెప్పాల్సి వస్తుంది .అందుకే బడ్జెట్ ప్రవేశపెట్టడానికి వెనకడుగు వేస్తున్నారు.వైసీపీ పాలనలో రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిందని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు .బాబు పాలనలోనే రాష్ట్రం ఆర్థికంగా దిగజారింది ” అంటూ జగన్ ( Jagan )విమర్శించారు. ఎన్నికల సమయంలో 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెబుతూ సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారని జగన్ విమర్శించారు.
” ఇప్పుడు అధికారం వచ్చాక అది చూపించడానికి ఇబ్బందులు పడుతున్నారు .గవర్నర్ ప్రసంగంలో పది లక్షల కోట్లు అయిందని చూపించారు.శ్వేత పత్రాల తో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.ఆర్బిఐ , కాగ్ రాష్ట్ర బడ్జెట్ లెక్కల ప్రకారం 2024 జూన్ వరకు కూటమి ప్రభుత్వం గద్దెనెక్కే వరకు ఐదు లక్షల 18 వేల కోట్లు అప్పు మాత్రమే అయింది.చంద్రబాబు హయాంలో 21.63% దాకా అప్పు చేశారు.వైసిపి హయాంలో కేవలం 12.9% అప్పు చేసాం.కేంద్ర ఆర్థిక సర్వే మా ప్రభుత్వ పనితీరును మెచ్చుకుంది.బడ్జెట్ లోను ఈ లెక్కలన్నీ చెప్పాల్సి వస్తుందని పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టడం లేదు. 14వ లక్షల కోట్లు అప్పు ఉందని చెప్పడం సరికాదు ” అంటూ జగన్ అన్నారు.