వీడియో వైరల్: నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని రిస్క్ చేసి భలే పట్టేసాడుగా..

ప్రస్తుతం వర్షాకాలం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తూ అనేక ప్రాంతాలను జయలమయం చేస్తున్నాయి.ఇలాంటి పరిస్థితులలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు కూడా.

 The Video Went Viral When He Took A Risk And Caught The Person Who Was Drowning-TeluguStop.com

కొంతమంది ఇతరుల ప్రాణాలు కాపాడేందుకు కూడా వారి ప్రాణాలను సాహసంగా పెట్టి ప్రయత్నం చేస్తారు.ఇలాంటి సంఘటనకు సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

వర్షాకాలంలో( rainy season ) నీళ్లలో మునిగిపోతున్న వారిని కాపాడటం కోసం కొంతమంది ప్రాణాలకు తగ్గించి నీళ్లలోకి వారిని కాపాడిన సంఘటనలు కూడా లేకపోలేదు.తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఈ వీడియోలో ముగ్గురు వ్యక్తులు నీటిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని తెలివితేటలు వాడి అతడి ప్రాణాలను కాపాడారు.ఓ డ్యామ్ దగ్గర ఉన్న ముగ్గురు వ్యక్తులు నీళ్లలో మునిగిపోయిన వ్యక్తిని గమనించి వెంటనే ఒక వైపు నుండి మరోవైపుకి పరిగెత్తారు.

అలా పరిగెత్తిన తర్వాత ఆ వ్యక్తి మరోవైపు నుండి ఇంకోవైపుకు బ్రిడ్జి కింద నుంచి వస్తున్నడాని గమనించిన వారు వెంటనే.ఒక యువకుడు నీటి వైపుకి దూకుతుండగా.మరో ఇద్దరు ఆ యువకుడి కాళ్లు ఒక్కొక్కరు ఒక్కొక కాలును పట్టుకున్నారు.ఆ యువకుడు తలకిందులుగా వేలాడి నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న వ్యక్తిని చేత పట్టుకుని పైకి లాగేసాడు.

దాంతో ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది.

ఇక ఈ వీడియో చూసిన సోషల్ మీడియా నెటిజెన్స్.వారిపై ప్రశంసల జల్లుల కురిపిస్తున్నారు.కనిపించని దేవుడు ఏమో కానీ.కనిపించే దేవుడు మాత్రం మీరే అంటూ వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.మరికొందరేమో ఈ వీడియో కావాలనే రికార్డు చేసినట్లుగా కనబడుతుందంటూ.ఫేక్ వీడియో అంటూ కామెంట్ చేస్తున్నారు.

సరదా కోసం ఇలాంటి సాహసాలు చేస్తే చివరికి ప్రాణాలు మీద తెచ్చుకుంటారు అంటూ వారిని తిట్టేవారు కూడా లేకపోలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube