వ‌ర్షాకాలంలో పాల‌ను ఈ విధంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఢోకా ఉండ‌దు!

పాలు.సంపూర్ణ పోష‌కాహారం అని అంద‌రికీ తెలుసు.అయిన‌ప్ప‌టికీ చాలా మంది పాల‌ను ఎవైడ్ చేస్తుంటారు.రుచి న‌చ్చ‌క‌పోవ‌డం, బ‌రువు పెరుగుతామ‌న్న భ‌యం లేదా ఇత‌రిత‌ర కార‌ణాల వ‌ల్ల పాల‌ను దూరం పెడుతుంటారు.కానీ, ప్ర‌స్తుత వ‌ర్షాకాలంలో మాత్రం పాల‌ను పొర‌పాటున కూడా ఎవైడ్ చేయ‌రాదు.ముఖ్యంగా ఇప్పుడు చెప్ప‌బోయే విధంగా పాల‌ను తీసుకుంటే వ‌ర్షాకాలంలో మీ ఆరోగ్యానికి ఢోకా ఉండ‌దు.

 Drinking Milk In This Way During Monsoons Is Very Good For Health , Milk, Drinki-TeluguStop.com

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం అస‌లు మ్యాట‌ర్ లోకి వెళ్లిపోదాం ప‌దండీ.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఐదు గింజ తొల‌గించిన ఎండు ఖ‌ర్జూరాలు, ఒక క‌ప్పు వేడి నీళ్లు వేసుకుని గంట పాటు నాన‌బెట్టుకోవాలి.

ఇలా నాన‌బెట్టుకున్న ఎండు ఖ‌ర్జూరాల‌ను వాట‌ర్‌తో స‌హా మిక్సీ జార్‌లో వేసి మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.ఇప్పుడు స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక‌టిన్న‌ర గ్లాస్ పాలు పోయాలి.

Telugu Benefits Milk, Milk, Dry Dates, Tips, Latest, Rainy Season-Telugu Health

పాలు కాస్త హీట్ అవ్వ‌గానే అందులో హాఫ్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ యాల‌కులు పొడి, పావు స్పూన్ ప‌సుపు, రెండు టేబుల్ స్పూన్ల బ్రౌన్ షుగ‌ర్ వేసి ఐదు నిమిషాల పాటు మ‌రిగించాలి.ఆపై గ్రైండ్ చేసి పెట్టుకున్న ఖ‌ర్జూరం పేస్ట్‌, వ‌న్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మ‌రో ఐదు నిమిషాల పాటు మ‌రిగించి స్ట‌వ్ ఆఫ్ చేయాలి.చివ‌రిగా కొన్ని బాదం ప‌లుకులు, పిస్తా ప‌లుకులు వేసుకుని సేవించాలి.

Telugu Benefits Milk, Milk, Dry Dates, Tips, Latest, Rainy Season-Telugu Health

వ‌ర్షాకాలంలో ప్ర‌తి రోజు ఈ విధంగా పాల‌ను తీసుకుంటే రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌ల‌ప‌డి సీజ‌న‌ల్ వ్యాధులు ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.అలాగే పాలు పైన చెప్పిన విధంగా త‌యారు చేసుకుని తీసుకుంటే ఎముక‌లు, కండ‌రాలు దృఢంగా మార‌తాయి.రక్తహీనత ఉంటే.దాని నుండి త్వరగా బయటపడతారు.గుండె ఆరోగ్య‌వంతంగా మారుతుంది.బ్రెయిన్ చురుగ్గా తయారై.మెమరీ పవర్ పెరుగుతుంది.

మ‌రియు మ‌ల‌బ్ధ‌కం స‌మ‌స్య నుంచి సైతం విముక్తి ల‌భిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube