చలికాలం( winter ) వచ్చిందంటే చాలు చర్మం విపరీతంగా డ్రై అయిపోతూ ఉంటుంది.ఎంత ఖరీదైన మాయిశ్చరైజర్ ను వాడినప్పటికీ దాని ప్రభావం కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది.
మళ్ళీ చర్మం యధావిధిగా పొడిపొడిగా మారి చికాకు, దురదకు దారి తీస్తుంది.మీరు కూడా ఈ చలికాలంలో డ్రై స్కిన్( Dry skin ) సమస్యతో బాగా విసుగు చెందుతున్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ సీరంను అస్సలు మిస్ అవ్వకండి.ఈ సీరం చలికాలంలో చర్మాన్ని తేమగా ఉంచడానికి సహాయపడుతుంది.
అదే సమయంలో మరెన్నో స్కిన్ కేర్ బెనిఫిట్స్ ను కూడా అందిస్తుంది.మరి ఇంతకీ ఆ సీరంను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఓ చూపు చూసేయండి.
ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు( Flax seeds ), వన్ టేబుల్ స్పూన్ మెంతులు( fenugreek ) వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి.
వాటర్ హీట్ అయ్యాక అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న అవిసె గింజలు మరియు మెంతులు వేసుకుని పది నిమిషాల పాటు ఉడికించాలి.ఆ తర్వాత అందులో కొన్ని ఎండిన గులాబీ రేకులు ( rose petals )వేసి మరో ఐదు నిమిషాల పాటు మరిగించాలి.
ఆపై స్టవ్ ఆఫ్ చేసి స్టైనర్ సహాయంతో థిక్ జెల్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జెల్లో రెండు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్( Rose water ), రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ మరియు వన్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్( Sweet almond oil ) వేసి బాగా మిక్స్ చేయండి.అవసరం అనుకుంటే మిక్సీ జార్ లో వేసి ఒకసారి గ్రైండ్ చేయండి.తద్వారా మన సీరం సిద్ధం అవుతుంది.ఈ సీరం ను బాటిల్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.
నైట్ స్నానం చేసిన తర్వాత ఈ సీరం ముఖానికి మెడకు అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.ఇలా నిత్యం కనుక చేస్తే డ్రై స్కిన్ అన్నమాట అనరు.ఈ సీరం మీ చర్మాన్ని ఎల్లప్పుడూ తేమగా ఉంచుతుంది.
గ్లోయింగ్ గా మెరుస్తుంది.అలాగే ఈ సీరంను వాడటం వల్ల చర్మంపై మొండి మచ్చలు క్రమంగా మాయం అవుతాయి.
ముడతలు ఏమైనా ఉంటే తగ్గుతాయి.మరియు స్కిన్ టైట్ గా బ్రైట్ గా సైతం మారుతుంది.