టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) చివరగా దేవర మూవీతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఒకవైపు వార్ 2( War 2 ) లో నటిస్తూనే మరొకవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా గ్రాండ్ గా మొదలైంది.
ఆ సంగతి పక్కన పెడితే.జూనియర్ ఎన్టీఆర్ నాన్ వెజ్ ప్రియుడు అన్న విషయం తెలిసిందే.
చికెన్ మటన్ బిర్యానీ అంటే ఎన్టీఆర్ కి చాలా ఇష్టం.

అలాగే మంచి వంటగాడు అన్న విషయం కూడా తెలిసిందే.ఎవరైనా ఇంటికి స్నేహితుడు కానీ చుట్టాలు కానీ వస్తే తానే స్వయంగా బిర్యానీ( Biryani ) ఇవ్వండి మరి వడ్డిస్తాడు అన్న విషయం చాలామందికి తెలియదు.ఆదివారం వచ్చిందంటే? వంట గదిలోనే ఉంటాడు.అన్నయ్య కళ్యాణ్ రామ్ కి ఫోన్ చేసి ఇంటికి రప్పించుకుని బిర్యానీ రుచి చూపించనిదే ఒప్పుకోడట అన్నయ్య అంటే అంత ప్రేమ ఎన్టీఆర్ కి.ఇక ప్రపంచంలో రకరకాల నాన్ వెజ్ వంటకాలు అన్నా? అంతే అమితంగా ఇష్టపడతాడు.కాగా ప్రస్తుతం రంజాన్ మాసం కావడంతో? ఎన్టీఆర్ హలీమ్( Haleem ) సీక్రెట్ కూడా లీక్ చేసాడు.

రంజాన్ మాసం అంటే హైదరాబాద్ అంతా హలీమ్ తోనే ఘుమఘుమలాడుతుంది.హలీమ్ కేవలం ఈ ఒక్క సీజన్ లో నే దొరుకుతుంది.కాబట్టి హలీమ్ రుచి చూడటానికి అంతా ఇష్టపడతారు.
కానీ తారక్ మాత్రం హలీమ్ ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు తానే స్వయంగా సిద్దం చేసుకుంటాడట.చికెన్ బిర్యానీ ఎంత ఇష్టమో? అంతకంటే ఎక్కువగా హలీమ్ ఇష్టం అంటున్నాడు తారక్.హలీమ్ తయారు చేయడం అంటే మనసు పెట్టి పని చేస్తానని అంటున్నాడు.తాను ఏది వండినా కేవలం ఇంట్లో వాళ్ల కోసం మాత్రమే కాకుండా స్నేహితుల్ని, సన్నిహితుల్ని పిలిచి మరీ తిని వెళ్లే వరకూ ఒప్పుకోడట.
అదీ తారక్ గొప్పతనం అని చెబుతున్నారు.ఇదే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.