ప్రస్తుత సమాజంలో చాలామంది ప్రజలు ఆధునిక జీవనశలి విధానాన్ని అనుసరించి తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.కొంతమంది ప్రజలు అయితే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడితే, మరి కొంతమంది రక్తపోటు, రక్తహీనత, నరాల బలహీనత వంటి సమస్యలకు గురవుతున్నారు.
దీనికోసం ఆయుర్వేద నిపుణులు సూచించిన ఔషధములు కలిగిన లడ్డూలను ప్రతిరోజు తినడం ఎంతో మంచిది.
కాబట్టి ఈ ఔషధ గుణాలు కలిగిన లడ్డును రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రుచిగా ఎండు కొబ్బరి లడ్డు తయారీకి కావలసిన పదార్థాలు ముఖ్యంగా అరకప్పు బెల్లం తురుము, అరకప్పు గోధుమపిండి, అరకప్పు నెయ్యి, పావు కప్పు యాలకులు, పావు కప్పు పిస్తా, పుచ్చకాయ బాదం డ్రైఫ్రూట్స్, ఒక కప్పు కొబ్బరి తురుము, ఒక కప్పు ఎండు ఖర్జూరాలు, నాలుగు యాలకులు.

ముందుగా స్టవ్ వెలిగించి దానిపై బౌల్ పెట్టుకొని ఎండు కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి బౌల్లో వేసి బయటకు వాసన వచ్చేదాకా బాగా వేయించాలి.ఇలా వేయించిన కొబ్బరి ముక్కలను మిక్సీలో వేసుకొని ఫైన్ గా పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.అదే వేడి చేసిన బౌల్లో డ్రై ఫ్రూట్స్, యాలకులను కూడా వాసన వచ్చేదాకా వేయించి, మిక్సీలో పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇప్పుడు స్టవ్ పై మరో బౌల్ లో పెట్టుకొని గోధుమపిండిని రెండు నిమిషముల పాటు వేయించాలి.ఇలా వేయించిన క్రమంలో నెయ్యి వేస్తూ బాగా కలుపుతూ మంచి రంగులో వచ్చేటట్లు కలుపుతూ ఉండాలి.ఇలా వేయించిన పిండిలో డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి.తర్వాత స్టౌ పై మరో బౌల్ పెట్టుకొని అందులో రెండు చెంచాల నెయ్యిని వేసి బాగా వేడి చేయాల్సి ఉంటుంది.
అందులోనే బెల్లం తురుము వేసి ఎలాంటి ఉండలు లేకుండా పూర్తిగా కరిగించాల్సి ఉంటుంది.ఆ తర్వాత లడ్డు ఆనకం వచ్చేదాకా బెల్లం మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలి.ఈ మిశ్రమంలో పైన వేయించి పెట్టుకున్నా అన్నిటిని వేసి బాగా కలపాలి.ఇలా కలిపిన తర్వాత కొంచెం చల్లగా అయినా తర్వాత చిన్న లడ్డూల్లా చేసుకొని ప్రతిరోజు ఒకటి నుంచి రెండు తినడం వల్ల రక్తహీనత, రక్తపోటు లాంటి సమస్యలు కూడా సులభంగా దూరమైపోతాయి.