తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నారు.మరి ఇలాంటి సందర్భంలోనే సాయిధరమ్ తేజ్( Saidharam Tej ) హీరోగా సంపత్ నంది( Sampath Nandi ) దర్శకత్వంలో రావలసిన గాంజా శంకర్( Gaanja Shankar ) సినిమా ఆగిపోయింది.
ఈ సినిమా ఎందుకు ఆగిపోయింది అనేదానిమీద రకరకాల కథనాలైతే వెలువడ్డాయి.నిజానికి ఈ సినిమా దర్శకుడు అయిన సంపత్ నంది రీసెంట్ గా ఓదెలో రైల్వేస్టేషన్ 2 సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో పాల్గొన్నప్పుడు ఆయన ఈ సినిమా ఆగిపోవడానికి గల ముఖ్య కారణాలు ఏంటో తెలియజేశాడు.
మొత్తానికైతే ఈ సినిమా ఆగిపోవడానికి గల కారణాలను చెబుతూ పోలీసులు ఆ సినిమా టైటిల్ మీద కొన్ని అభ్యంతరకరమైన ఆంక్షలు విధించారు.

దానివల్లే ఆ సినిమాను ఆపేసామంటూ ఏదో ఒక కారణం అయితే తెలియజేయబోయాడు.కానీ ఆయన చెప్పిన మాటలను బట్టి చూస్తుంటే అసలు కారణం అదికాదు ఆ సినిమా ఆగిపోవడానికి టైటిల్ కి పెద్దగా సంబంధం ఏముంటుంది.పోలీసులు టైటిల్ మీద అబ్జెక్షన్ చెబితే టైటిల్ని మారిస్తే సరిపోతుంది.
అలాగని సినిమా నే వదులుకోలేము కదా అంటూ చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.

మొత్తానికైతే సంపత్ నంది ఈ విషయంలో చాలా వరకు అబద్ధాలు చెబుతున్నాడు అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.ఇక ఏది ఏమైనా కూడా సంపత్ నంది స్టార్ డైరెక్టర్ గా ఎదిగే అవకాశాలు చాలా వరకు వచ్చినప్పటికి వాటిని సద్వినియోగం చేసుకోవడంలో ఆయన చాలా వరకు వెనుకబడిపోయాడు.అందుకే ఆయన మీడియం రేంజ్ డైరెక్టర్ గానే కొనసాగుతూ ముందుకు సాగుతున్నాడు…మరి ఇప్పుడు రాబోతున్న సినిమాలతో సూపర్ శకేస్ సాధిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది….