క్యాన్సర్ మీద ఉన్న చిత్రమైన అపొహలు

భారతదేశంలో 30 లక్షలకి పైగా క్యాన్సర్‌ పేషెంట్లు ఉన్నారట.ఇది ఒక సర్వే అంచనా మాత్రమే.

వాస్తవంలో ఈ సంఖ్య మరింత ఎక్కువే ఉండొచ్చు.లక్షలమంది ప్రతీ ఏటా క్యాన్సర్‌ వలన మరణిస్తున్నారు.

ఇంత ప్రమాదకరమైన విషయం అయినా, క్యాన్సర్ పట్ల ఇంకా పూర్తి అవగాహన కనబడదు చాలామందిలో.క్యాన్సర్ మీద కొన్ని విచిత్రమైన అపోహాలు కూడా ప్రచారంలో ఉన్నాయి.

* క్యాన్సర్ నయం కాని జబ్బు అని అంటారు కొందరు.తొందరగా పసిగట్టాలే కాని, క్యాన్సర్ ని ఎదురుకోవచ్చు.

Advertisement

నయం చేసుకోవచ్చు.* క్యాన్సర్ వస్తే మనిషి చనిపోయినట్లే అని భావిస్తారు మరికొందరు.

ఇందులో కూడా నిజం లేదు.క్యాన్సర్‌ బారినుంచి తప్పించుకోని బ్రతికేవారి సంఖ్య తక్కువే కావచ్చు కాని క్యాన్సర్ వచ్చిన ప్రతీ మనిషి చనిపోవట్లేదు.

* క్యాన్సర్‌ తో బాధపడేవారు షుగర్ ఉన్న వస్తువులు తింటే క్యాన్సర్ పెద్దగా అవుతుందనేది ఒక అపోహ.షుగర్ లెవెల్స్ ప్రత్యేకంగా క్యాన్సర్ సెల్స్ ని పెంచవు.

క్యాన్సర్ దశలు మారుతూ పెద్దగా అయిపోతుంది.* క్యాన్సర్ నుంచి తప్పించుకున్నా, మళ్ళీ సాధారణ జీవితం గడపలేమని అంటారు కొందరు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఎముక‌ల బ‌ల‌హీన‌త‌కు చెక్ పెట్టే అద్భుత‌మైన ఆకుకూర‌లు ఇవే!

భారత స్టార్ క్రికేటర్ యువరాజ్ సింగ్ ఒంట్లో క్యాన్సర్‌ పెట్టుకోని దేశానికి ప్రపంచకప్ అందించాడు.ఆ తరువాత క్యాన్సర్ నుంచి విముక్తి పొంది ఇప్పుడు మళ్ళీ క్రికేట్ ఆడుతున్నాడు.

Advertisement

ఆసాధారణ జీవితం గడుపుతున్నవాడే క్యాన్సర్‌ తరువాత కూడా బాగున్నాడు, మిగితా వారు ఉండలేరా ? * క్యాన్సర్ ట్రీట్‌మెంట్ నొప్పిగా ఉంటుందని నమ్ముతారు చాలామంది.క్యాన్సర్ ట్రీట్‌మెంటులో కెమోథెరాపెటిక్ డ్రగ్స్ వాడతారు.

ఇవేమి నొప్పిని తెప్పించవు.వస్తే గిస్తే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావొచ్చు.

తాజా వార్తలు