క్లియర్ అండ్ వైట్ స్కిన్( Clear and white skin ) కోసం ప్రతి ఒక్కరూ ఎంతగానో ఆరాటపడుతుంటారు.మచ్చలు ఏమైనా ఉంటే వాటిని తగ్గించుకుని చర్మాన్ని తెల్లగా మార్చుకోవడం కోసం రకరకాల క్రీమ్స్ ను వాడుతుంటారు.
ఎన్నెన్నో ఫేస్ ఫ్యాక్స్ వేసుకుంటారు.కానీ వాటికంటే పవర్ ఫుల్ గా పని చేసే ఆయిల్ ఒకటి ఉంది.
ఈ ఆయిల్ ను కనుక వాడారంటే మచ్చలు పోయి మీ ముఖం వైట్ గా మారడం ఖాయం.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక చిన్న క్యారెట్( Carrot ) ను తీసుకుని సన్నగా తురుముకోవాలి.అలాగే తొక్క తొలగించిన అంగుళం పచ్చి పసుపు కొమ్మును కూడా తీసుకుని తురుముకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె ను పెట్టుకుని అందులో ఒక కప్పు ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్( Extra virgin coconut oil ) వేసుకోవాలి.ఆపై అందులో అంగుళం దాల్చిన చెక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి.
అలాగే క్యారెట్ తురుము, పచ్చి పసుపు తురుము, కొన్ని ఎండిన ఆరెంజ్ పండు తొక్కలు వేసి గరిటెతో కలుపుతూ ఉడికించాలి.

దాదాపు పది నుంచి 12 నిమిషాలు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.స్ట్రైనర్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ ఆయిల్ లో రెండు నుంచి మూడు చుక్కలు రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ ( Essential oil )వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఆపై ఒక బాటిల్ లో ఆయిల్ ని నింపుకొని స్టోర్ చేసుకోవాలి.నైట్ నిద్రించే ముందు ఈ ఆయిల్ ను ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.
ఆయిల్ పూర్తిగా చర్మంలోకి ఇంకిపోయే వరకు మసాజ్ చేసుకుని పడుకోవాలి.

రెగ్యులర్ గా ఈ ఆయిల్ ను కనుక వాడారంటే చర్మం పై ఎలాంటి మొండి మచ్చలు ఉన్నా సరే పరార్ అవుతాయి.స్పాట్ లెస్ స్కిన్ మీ సొంతం అవుతుంది.అలాగే ఈ ఆయిల్ స్కిన్ వైట్నింగ్ సహాయపడుతుంది.
నిత్యం ఈ ఆయిల్ ను వాడారంటే చర్మం తెల్లగా మారుతుంది.కాంతివంతంగా మెరుస్తుంది.
కాబట్టి మచ్చలేని మెరిసే తెల్లటి చర్మాన్ని పొందడానికి తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న ఆయిల్ ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.