బాక్సర్ గా మారిపోయిన లక్ష్మీప్రసన్న... ఫోటోలు వైరల్!

సీనియర్ నటుడు మోహన్ బాబు వారసురాలిగా లక్ష్మీప్రసన్న ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా పేరు సంపాదించుకోవాలని ఈమె విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఈమెకు సరైన బ్రేక్ రాలేదని చెప్పాలి.

 Manchu Lakshmi Turns Into Boxer Photos Goes Viral Details, Manchu Lakshmi, Tolly-TeluguStop.com

ఈ విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో హీరోయిన్ గా నటించినా ప్రేక్షకులను సందడి చేయలేకపోయింది.కనీసం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా సక్సెస్ సాధించలేకపోయినా లక్ష్మీప్రసన్న తన ప్రయత్నం మాత్రం వదలకుండా సరికొత్త పాత్రల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఈ క్రమంలోనే మొట్ట మొదటి సారి లక్ష్మీ ప్రసన్న మలయాళంలో మోహన్ లాల్ తో కలిసి మాన్ స్టర్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ సినిమా కోసం మంచు లక్ష్మి కలరీ విద్యను నేర్చుకున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం ఈ కలరీ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు.అయితే తాజాగా మంచు లక్ష్మి బాక్సర్ గా మారిపోయారు.

మాన్ స్టర్ సినిమా షూటింగ్ పనులను డబ్బింగ్ పనులను పూర్తి చేసుకున్న మంచు లక్ష్మి ట్రైనర్ పర్యవేక్షణలో భాగంగా బాక్సర్ గా మారిపోయి సీరియస్ గా వరుస పంచ్ లు విసురుతున్న మంచు లక్ష్మికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ క్రమంలోనే ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ఈమె యంగ్ లుక్ వెనుక దాగి ఉన్న సీక్రెట్ కూడా ఇదే అంటూ కొందరు వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.మొత్తానికి మంచు లక్ష్మి బాక్సింగ్ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube