తెలంగాణలో కాంగ్రెస్ ( Congress )ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తుంది.ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) రోజుకు రెండు, మూడు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులకు మద్ధతుగా ఆయన ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.ఇవాళ మూడు చోట్ల సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేయనున్నారు.
ముందుగా కోరుట్లకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడ కాంగ్రెస్ నిర్వహించే జనజాతర సభలో పాల్గొననున్నారు.తరువాత హైదరాబాద్ లోని కూకట్ పల్లి నియోజకవర్గంలో జరిగే కార్నర్ మీటింగ్ కు హాజరుకానున్నారు.
అనంతరం శేరిలింగంపల్లిలో జరిగే కార్నర్ మీటింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు.ప్రచారంలో భాగంగా ప్రతిపక్షాలపై రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే లోక్ సభ ఎన్నికలు ముగిసిన తరువాత బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందని ఆరోపించారు.







