అమిత్ షా ఫేక్ వీడియో కేసు.. విచారణకు దూరంగా కాంగ్రెస్ నేతలు

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా( Home Minister Amit Shah ) ఫేక్ వీడియో కేసుపై ఢిల్లీ పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.నోటీసుల్లో పేర్కొన్న ప్రకారం ఢిల్లీ పోలీసుల విచారణకు ఇవాళ కాంగ్రెస్ నేతలు హాజరు కావాల్సి ఉంది.

 Amit Shah Fake Video Case Congress Leaders Stay Away From Investigation , Congre-TeluguStop.com

అయితే విచారణకు నేతలు గైర్హాజరు అవుతున్నారని తెలుస్తోంది.ఎన్నికల ప్రచారం ఉన్న నేపథ్యంలో 15 రోజుల సమయం కావాలని కాంగ్రెస్ నాయకులు కోరారు.

అయితే విచారణకు హాజరుకాకుంటే క్రిమినల్ చర్యలు ఉంటాయని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు.మరోవైపు న్యాయపరంగా ముందుకు వెళ్లే యోచనలో కాంగ్రెస్( Congress ) నేతలు ఉన్నారని సమాచారం.

అయితే రిజరేషన్ల రద్దుపై అమిత్ షా పేరిట ఓ ఫేక్ వీడియోను కాంగ్రెస్ వైరల్ చేసిందన్న ఆరోపణల నేపథ్యంలో రంగంలోకి దిగిన ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు పలువురు కాంగ్రెస్ నేతలకు నోటీసులు అందించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే హైదరాబాద్ గాంధీభవన్ కు వచ్చిన పోలీసులు నాయకులకు నోటీసులు అందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube