మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి( Balineni Srinivas Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.ఒంగోలులో భారీ మెజార్టీతో గెలవబోతున్నానని తెలిపారు.
జిల్లాలో వైసీపీ( YCP ) ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుంటుందని బాలినేని పేర్కొన్నారు.ఏపీలో జగన్( Jagan ) మరోసారి సీఎం కాబోతున్నారని తెలిపారు.ఎగ్జిట్ పోల్స్ పై ( Exit Polls ) జాతీయ సర్వేల రిపోర్టులు ఫేక్ అని చెప్పారు.తప్పుడు సర్వేలు ఎన్ని ఇచ్చినా గెలవబోయేది వైసీపీయేనని ధీమా వ్యక్తం చేశారు.
మరోవైపు వైసీపీ విజయం సాధిస్తుందన్న ఆ పార్టీ నేతలు సంబురాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.