వైట్ హెయిర్. ప్రపంచవ్యాప్తంగా దీని బాధితులు కోట్ల సంఖ్యలో ఉన్నారు.
ఇదేమి ప్రాణాలు తీసేంత పెద్ద సమస్య కాకపోవచ్చు.కానీ, మనిషిని మానసికంగా ఎంతగానో దెబ్బ తీస్తుంది.
మనోధైర్యాన్ని కోల్పోయేలా చేస్తుంది.అందులోనూ చిన్న వయసులోనే తెల్ల జుట్టు వచ్చేస్తే.
ఇక వారి బాధ వర్ణణాతీతం.ఎవరైనా చూసి నవ్వుతారేమో అని తెల్ల జుట్టుతో బయటకు వెళ్లడానికే భయపడుతుంటారు.
ఈ క్రమంలోనే రంగులతో తెల్ల జుట్టును ఎవరికీ కనిపించుకుండా దాచేస్తుంటారు.
ఈ జాబితాలో మీరు ఉన్నారా.? అయితే ఇకపై వైట్ హెయిర్ తో మీరు టెన్షన్ పడక్కర్లేదు.ఎందుకుంటే, ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాను పాటిస్తే తెల్ల జుట్టును సహజంగా నల్లగా మార్చుకోవచ్చు.
మరి లేటెందుకు ఆ చిట్కా ఏంటో తెలుసుకుందాం పదండీ.ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల నల్ల జీలకర్ర, వన్ టేబుల్ స్పూన్ మెంతులు, గుప్పెడు ఎండిన కరివేపాకు ఆకులు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని అందులో ఒక కప్పు ఆవ నూనెను పోయాలి.

నూనె కాస్త హీట్ అవ్వగానే అందులో నల్ల జీలకర్ర, మెంతులు, కరివేపాకు పొడి వేసి కలిపి ఒక నిమిషం పాటు ఉడికించాలి.ఆ తర్వాత అందులో మూడు టేబుల్ స్పూన్ల గోరింటాకు పొడిని యాడ్ చేసి కలుపుకుంటూ మరో నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారబెట్టుకుని.
అప్పుడు జుట్టు కదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకోవాలి.ఓ మూడు గంటల పాటు షవర్ క్యాప్ పెట్టేసుకుని.
ఆపై మైల్డ్ షాంపూతో తల స్నానం చేయాలి.ఇలా వారంలో ఒక్కసారి చేశారంటే తెల్ల జుట్టు క్రమంగా నల్లబడుతుంది.
కాబట్టి, ఈ సింపుల్ చిట్కాను తప్పకుండా ప్రయత్నించండి.