తెలుగు బుల్లితెరపై పలువురు యాంకర్లు సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతున్నారు.స్టార్ యాక్టర్లకు ఏమాత్రం తీసిపోని రేంజిలో క్రేజ్ సంపాదించుకుంటున్నారు.
ప్రస్తుతం సుమ, అనసూయ, ప్రదీప్, రష్మీ, సుధీర్ సహా పలువురు యాంకర్లు దుమ్మురేపుతున్నారు.సోషల్ మీడియాలో వీరికి పిచ్చ పాపులారిటీ ఉంది.
తెలుగు టీవీ యాంకర్లలో పలువురు ఉన్నత విద్యను అభ్యసించిన వారు ఉన్నారు.ఇంతకీ ఆ యాంకర్ల ఎడ్యుకేషన్ క్వాలిఫి కేషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
సుమ
తెలుగు టీవీ పరిశ్రమలో మకుటంలేని మహారాణి సుమ.బుల్లితెరను ఓ రేంజిలో ఏలుతున్న యాంకర్.
ఈటీవీ సహా పలు టీవీల్లో ప్రసారం అయ్యే పలు షోలను ఆమె సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తుంది.ఆమె ఎంకామ్ చదివి సినిమా రంగం వైపు అడుగులు వేసింది.అక్కడి నుంచి బుల్లితెరపై సెటిల్ అయ్యింది.
ఝాన్సీ
వెండి తెరపై నటిగా ఎంట్రీ ఇచ్చి బుల్లి తెరపైకి చేరింది యాంకర్ ఝాన్సీ.ఓ వైపు టీవీల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూనే… మరోవైపు పలు టీవీ షోలు చేస్తుంది.ఈమె బీటెక్ లో కెమికల్ ఇంజినీరింగ్ చేసింది.
ఉదయభాను
ఆర్ నారాయణ మూర్తి ఎర్రసైన్యం సినిమాతో వెండి తెరకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత టీవీ రంగంలోకి వచ్చింది.పలు షోల ద్వారా మంచి పాపులారిటీ సంపాదించింది.ఈమె ఎంఏ కంప్లీట్ చేసింది.
అనసూయ
ఓ న్యూస్ చానెల్ లో న్యూస్ ప్రజెంటర్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె.ఆ తర్వాత జబర్దస్త్ షోకు యాంకర్ గా మారింది.ఈ షోతో తన కెరీర్ మారిపోయింది.
ఇదే కాదు పలు షోలతో హాట్ యాంకర్ గా గుర్తింపు పొందింది.పలు సినిమాల్లోనూ నటిస్తుంది.ఆమె ఎంబీఏ చదివింది.
ప్రదీప్
కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా షోతో పాపులర్ అయ్యాడు ప్రదీప్.ప్రస్తుతం తెలుగు టీవీ రంగంలో టాప్ యాంకర్ గా కొనసాగుతున్నాడు.ఆయన ప్రస్తుతం పలు సినిమాల్లోనూ చేస్తున్నాడు.ఆయన ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లో బీటెక్ చేశాడు.
లాస్య
సమ్‌థింగ్ స్పెషల్ షోతో పాపులర్ అయ్యింది లాస్య.ఆ తర్వాత పలు షోలు చేసింది.ఆమె బీటెక్ కంప్లీట్ చేసింది.
అటు రవి, రష్మీ, ఓంకార్, హరితేజ, శ్యామల, వర్షిణి డిగ్రీ చేయగా.సుధీర్ మాత్రం ఇంటర్మీడియట్ తో చదువు ఆపేశాడు.