వసంత పంచమి( Vasantha panchami ) పండుగను భారతదేశమంతా కూడా ఎంతో వైభవంగా జరుపుకుంటారు.ఇది కూడా ఋతువుల మార్పుల పండుగ.
వసంత పంచమి తర్వాత వేడి సీజన్ ప్రారంభమవుతుంది.ఈ రోజున అమ్మ సరస్వతిని పూజించడం వలన శుభం జరుగుతుందని పండితులు చెబుతున్నారు.
ముఖ్యంగా వసంత పంచమి పండుగ నాడు పసుపు రంగు దుస్తులు ధరించడానికి చాలా ప్రాముఖ్యత ఉంది.ఆ ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వసంత పంచమి రోజున పసుపు రంగు బట్టలు ధరిస్తారు.ఎందుకంటే పసుపు రంగు వసంత రుతువుకు చిహ్నం.
కాబట్టి ఆ రోజున సరస్వతి మాతను పూజిస్తారు.

అయితే పసుపు రంగు శ్రేయస్సు, ఉత్సాహం, కొత్త ప్రారంభాలకు చిహ్నంగా పరిగణిస్తారు.కాబట్టి వసంత పంచమినాడు పసుపు రంగు దుస్తులను ధరిస్తారు.ఇక ఈ పసుపు దుస్తులు పండుగ వాతావరణం, కొత్త ప్రారంభలు కూడా సంకేతం.
ఇక హిందూ క్యాలెండర్ ప్రకారం హిందూ మతంలో వసంత పంచమి పండుగను ప్రతి సంవత్సరం మాఘమాసం( Magha Masam )లోని శుక్లపక్షం ఐదవ రోజున వైభవంగా జరుపుకుంటారు.ఈ రోజున సరస్వతి మాతను ఆరాధిస్తారు.
ఈ సంవత్సరం వసంత పంచమి 14 ఫిబ్రవరి 2024న జరుపుకుంటారు.ఇక ఫిబ్రవరి 14వ తేదీ ఉదయం 10:30 నుండి ఈ మధ్యాహ్నం 1:30 గంటల వరకు సరస్వతి దేవిని ఆరాధించేందుకు మంచి సమయం అని చెప్పవచ్చు.</br

అయితే సరస్వతి మాతకు పసుపు రంగు ఇష్టమైన రంగు అని నమ్ముతారు.కాబట్టి వసంత పంచమి రోజున శారదా దేవిని పసుపు రంగు దుస్తులు ధరించి పూజిస్తారని వేద పండితులు చెబుతున్నారు.అంతే కాకుండా పసుపు పుష్పాలను కూడా తల్లికి సమర్పిస్తారు.ఎక్కువగా వసంత పంచమి రోజున పూజలో పసుపు వస్తువులనే ఉపయోగించడానికి శుభప్రదంగా పరిగణిస్తారు.ఇలా చేయడం వలన సరస్వతి మాత( Saraswathi devi ) సంతోషిస్తుంది.ఈ విధంగా సరస్వతి దేవి సంతోషించి జ్ఞానాన్ని, వివేకాన్ని ప్రసాదిస్తుంది.
అంతేకాకుండా వసంత పంచమి రోజున సరస్వతి దేవికి పసుపు రంగు బియ్యం, పసుపు లడ్డులు, పసుపు పాయసం కూడా సమర్పిస్తారు.