మన దేశ వ్యాప్తంగా వినాయక ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుపుకున్నారు.ఈ పండుగను 10 రోజుల పాటు సెలబ్రేట్ చేసుకుంటారు.
ఆ తర్వాత గణపయ్యను నిమజ్జనం చేస్తారు.ఈ సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీన అంటే గురువారం రోజున వినాయక నిమజ్జనం జరుగుతుంది.
అయితే నిమజ్జనంలో కొన్ని నియమాలను పాటిస్తే అంతా శుభమే జరుగుతుందని పండితులు( Scholars ) చెబుతున్నారు.వినాయకుడి పూజకు ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.
బొజ్జ గణపయ్యను ఏకదంతా అని, వినాయకుడు అని ఎన్నో పేర్లతో పిలుస్తారు.అలాగే ఏ శుభకార్యానికైనా వినాయకుడినీ ముందుగా పూజిస్తారు.
గణపయ్య జన్మదినన్నీ పురస్కరించుకుని వినాయక చవితిని ప్రతి సంవత్సరం పది రోజులపాటు జరుపుకుంటారు.

పది రోజుల తర్వాత వినాయక నిమజ్జనం చేస్తారు.అయితే కొంతమంది ఒకటిన్నర, 3, 5, 7 రోజుల్లో కూడా వినాయకుడి నిమజ్జనం నిర్వహిస్తారు.మరి వినాయకుడిని నిమజ్జనం చేయడానికి ముందు ఎలాంటి నియమాలను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే గణపయ్య నిమజ్జనానికి ముందుగా దేవుడినీ ఇష్టంగా పూజించాలి.ఎర్రని పూలు, ఎర్రచందనం, దుర్వ, శెనగ పిండి, తమలపాకు, ధూప దీపం, పాన్ మొదలైన వాటిని వినాయకుడికి సమర్పించాలి.
ఆ తర్వాత కుటుంబ సభ్యులందరూ వినాయకుడికి హారతినివ్వాలి.అలాగే చతుర్దశి రోజు( Chaturdashi day )నా వినాయకుడు తన ఇంటికి తిరిగి వస్తాడని ప్రజలు నమ్ముతారు.
అందుకే వినాయకుడిని ఖాళీ చేతులతో నిమజ్జనం చేయకూడదు.

కాబట్టి నిమజ్జనానికి ముందు వినాయకుడి చేతిలో లడ్డును( Laddu ) ఉంచాలి.మీరు చిన్న చిన్న మట్టి విగ్రహాలను నిమజ్జనం చేయాలనుకుంటే మీ ఇంట్లో ఉండే నీటి తొట్టిలో నిమజ్జనం చేయవచ్చు.మట్టి పూర్తిగా కరిగిన తర్వాత పూజ కుండలో నీళ్లు పోసి ఉంచాలి.
విగ్రహం మరి పెద్దదిగా ఉంటే నిర్ణీత ప్రదేశంలో నిమజ్జనం చేయాలి.నిమజ్జనం సమయంలో గణపయ్యను మళ్ళీ రమ్మని ప్రార్థించాలి.
గణపయ్య నిమజ్జనం సమయంలో పరిశుభ్ర పై శ్రద్ధ ఉంచాలి.నిమజ్జనం సమయంలో మీ మనసులో చెడు ఆలోచనలు( Bad thoughts ) లేకుండా చూసుకోవాలి.
ముఖ్యంగా నిమజ్జనం రోజున మాంసం జోలికి కానీ, మద్యం జోలికి కానీ అసలు వెళ్ళకూడదు.అలాగే ఆ రోజున మీరు నలుపు రంగు దుస్తులను ధరించకూడదు.