అసలు ఉపవాసం ఎందుకు చేయాలి, దాని వల్ల ఫలితం ఏమిటి?

చాలా మంది తమకు నచ్చిన దేవుడి కోసం ఉపవాసం ఉంటారు.కొన్ని కోరికలు కోరుకుని అది నేరవారాలంటూ… పలు వారాల్లో ఉపవాసం ఉంటుంటారు.అయితే హిందువులు పౌర్ణమి, శివరాత్రి వంటి రోజుల్లో.అలాగే తమకు నచ్చిన రోజునాడు ఏమీ తినకుండా ఉపవాసం ఉంటారు.ముస్లింలు అయితే రంజాన్ మాసంలో.క్రిస్టియన్లు కూడా ఒక నెల రోజుల పాటు ఉపవాసం ఉంటారు.

 What Is The Reason Behind Upavasam, Upavasam , Pooja , God, Devotional-TeluguStop.com

అయితే అసలు ఉపవాసం ఎందుకు చేయాలి, చేయడం వల్ల కల్గే లాభాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

భగవంతుడి అనుగ్రహం పొందడానికే మనం ఉపవాసం చేస్తాం.

ఇంకా చెప్పాలంటే శారీరక, మాసకిల మాలిన్యాలను వదిలించుకోవడానకే ఉపవాస దీక్ష.నిష్కామంగా ఈ దీక్షను చేయగల్గితే భగవంతుడు మన కోరికలను అడగకుండానే నెరవేర్చుతాడని ప్రతీతి.

శరీరానికి అలసట కలిగితేనే మనసు స్థిర పడుతుంది. మనసు స్థిరపడి నిగ్రహాన్ని పొందితేనే ఆత్మ జ్ఞానం కల్గుతుంది.

ఆత్మజ్ఞానం పొందినప్పుడే ఓ మనిషి తనని తాను తెలుసుకుంటాడు.తనని తాను తెలుసుకోవడం అంటే దైవం గురించి తెలుకోవడం అని అర్థం.

ఉపవాస దీక్ష రోజున కేవలం పండ్లను, పాలను స్వీకరిస్తూ… పూర్తిగా దైవ చింతనలోనే దీక్షా సమయాన్ని గడపాలి.కానీ చాలా మంది ఉపవాస రోజుల్లో కూడా చెడు ఆలోచనలు చేస్తుంటారు.

దీని వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు.అందుకే పూర్తిగా మీ మనసు దేవుడి మీద లగ్నం చేయ గల్గితేనే ఉపవాసం దీక్షను చేయండి.

లేనిపక్షంలో మానేయడం మంచిదని వేద పండితులు చెబుతున్నారు.

WHAT IS THE REASON BEHIND UPAVASAM

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube