అల్లూరి వేషధారణలో బైక్ ర్యాలీ చేస్తూ అభిమానాన్ని చాటుకున్న చరణ్ ఫాన్స్!

దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎన్టీఆర్ రామ్ చరణ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూసిన ఆర్ఆర్ఆర్ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని అందిస్తుంది.ఇక ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన అభిమానులు సైతం థియేటర్ల దగ్గర పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.

 Charan Fans In A Bike Rally In Alluri Sitha Ramaraju Getup, Rrr Movie, Ram Charn-TeluguStop.com

ఇకపోతే ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన సంగతి మనకు తెలిసిందే.

స్వాతంత్ర సమర యోధుడు, మన్యం దొర, విప్లవ వీరుడు అల్లూరి వేషధారణలో రామ్ చరణ్ ఎంతో అద్భుతంగా నటించారు.

ఇక రామ్ చరణ్ ఈ సినిమాలో అల్లు సీతారామరాజు పాత్రలోసందడి చేయడంతో ఆయన అభిమానులు కూడా వినూత్న పద్ధతిలో తనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.ఈ క్రమంలోనే హైదరాబాద్లో చరణ్ అభిమానులు అల్లూరి వేషధారణలో బైక్ పై ర్యాలీ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.

Telugu Allusitha, Bike, Ram Charn, Rrr, Tollywood-Movie

రామ్ చరణ్ అభిమానులు ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లో అల్లూరి వేషధారణలో ఆకట్టుకున్నారు.ఈ విధంగా బైక్ ర్యాలీ చేస్తూ సుదర్శన్ థియేటర్ దగ్గర పెద్ద ఎత్తున సందడి చేశారు.ఈ విధంగా వందలమంది అల్లూరి సీతారామరాజులు ఇలా బైక్ ర్యాలీ చేస్తూ రామ్ చరణ్ పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube