పురాతన కాలంలో దాచిపెట్టిన నిధులు ఇప్పటి ప్రజలకు దొరుకుతూ వారు జీవితాన్నే మార్చేస్తున్నాయి.తాజాగా చెక్ రిపబ్లిక్‌లోని కుత్నా హోరా( Kutna Hora ) అనే ఒక చిన్న పట్టణంలోని బీచ్‌లో వాకింగ్ చేస్తున్న ఒక మహిళకు కూడా ఇలానే అదృష్టం వరించింది.
నడుస్తున్న సమయంలో ఆమెకు ఇసుకలో దాగి ఉన్న 2,150 కంటే ఎక్కువ పురాతన వెండి నాణేలు కనిపించాయి.నిపుణుల ప్రకారం, ఇలాంటి విలువైన వస్తువులు కనుగొనడం చాలా అరుదు, ఒక దశాబ్దానికి ఒకసారి మాత్రమే జరుగుతుంది.
ఈ నాణేలు చాలా పురాతనమైనవి, 1085 నుండి 1107 మధ్య కాలానికి చెందినవి అని నిపుణులు వెల్లడించారు.వీటిని బహుశా ప్రేగ్ లో తయారు చేసి ఉండవచ్చు, తరువాత బోహెమియాకు తరలించి ఉండవచ్చు.
ఈ నాణేలు ఎక్కువగా వెండితో తయారు చేయబడ్డాయి, కానీ వాటిలో కొద్దిగా రాగి, సీసం, ఇతర లోహాలు కూడా ఉన్నాయి.ఈ కాలం చరిత్రకారులకు ఒక రహస్యం, కాబట్టి ఈ నాణేల ఆవిష్కరణ వారికి ఎంతో ముఖ్యమైనది.
కాయిన్స్‌లోని లోహాలను( Metals in Coins ) పరీక్షించడం ద్వారా, నిపుణులు వాటి చరిత్ర గురించి మరింత తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు.ఫిలిప్ వెలిమ్స్కీ అనే పురావస్తు శాస్త్రవేత్త ఈ ఓల్డ్ కాయిన్స్ కొన్ని పోరాటాల కారణంగా భూమిలో పాతిపెట్టి ఉండవచ్చు అని భావిస్తున్నారు.ఆ కాలంలో, ప్రేగ్ ను పాలించిన ప్రెమిస్లిడ్ కుటుంబం తరచుగా ఒకరితో ఒకరు పోరాడుకునేవారు, అనేక యుద్ధాలు జరిగాయి.
ఈ నాణేలు మొదట తయారు చేసినప్పుడు చాలా విలువైనవి.నేడు, అవి ఇంకా చాలా విలువైనవి, కోట్లాది రూపాయలకు విలువ ఉంటాయి.గత పది సంవత్సరాలలో కనుగొన్న అతిపెద్ద నిధి ఇదేనని ప్రజలు అంటున్నారు.పురావస్తు శాస్త్రవేత్తలు ఈ కాయిన్స్‌ను మరింత లోతుగా అధ్యయనం చేయడానికి, వాటిలో ఏ లోహాలు ఉన్నాయో కచ్చితంగా తెలుసుకోవడానికి ప్రణాళికలు వేస్తున్నారు.2025లో ఒక ప్రదర్శనలో వీటిని ప్రదర్శించాలని వారు భావిస్తున్నారు.