ఒత్తైన జుట్టు కోసం ఆరాటమా.. అయితే ముల్తానీ మట్టితో ఇలా చేయండి!

ముల్తానీ మట్టి( multani mitti ).దీని గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు.

 How To Get Thick Hair With Multani Mitti! Thick Hair, Hair Care, Hair Care Tips,-TeluguStop.com

సౌందర్య సాధనలో ముల్తానీ మట్టిని విరివిరిగా వాడుతుంటారు.స్కిన్ టోన్ ను పెంచడానికి, చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి, మచ్చలను నివారించడానికి ముల్తానీ మట్టి అద్భుతంగా సహాయపడుతుంది.

అయితే ముల్తానీ మట్టి కేవలం చర్మ సౌందర్యాన్ని పెంచడానికి మాత్రమే ఉపయోగపడుతుందని చాలా మంది భావిస్తుంటారు.కానీ అది పొర‌పాటు.

ముల్తానీ మట్టి జుట్టు సంరక్షణకు కూడా ఉపయోగపడుతుంది.అనేక జుట్టు సంబంధిత సమస్యల‌ను అడ్డుకుంటుంది.

ముఖ్యంగా ఒత్తైన జుట్టు కోసం ఆరాటపడే వారికి కూడా ముల్తానీ మట్టి గ్రేట్ గా హెల్ప్ చేస్తుంది.మరి ముల్తానీ మట్టిని ఉపయోగించి ఒత్తైన జుట్టును పొందడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక కలబంద ఆకు( Aloe Vera )ను తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి జెల్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో కలబంద జెల్, నాలుగు రెబ్బలు కరివేపాకు, మూడు టేబుల్ స్పూన్లు ముల్తానీ మట్టి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

Telugu Care, Care Tips, Problems, Latest, Multani Mitti, Multanimitti, Thick, Th

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో ఒకటిన్నర గ్లాస్ వాటర్ మరియు రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు రెగ్యులర్ షాంపూ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ వాటర్ ను ఉపయోగించి హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి రెండు సార్లు ఈ విధంగా హెయిర్ వాష్ చేసుకుంటే చాలా ప్రయోజనాలు పొందొచ్చు.

Telugu Care, Care Tips, Problems, Latest, Multani Mitti, Multanimitti, Thick, Th

ముఖ్యంగా ముల్తానీ మట్టి, కలబంద మరియు కరివేపాకు( Curry leaves )లో ఉండే పలు సుగుణాలు హెయిర్ గ్రోత్ ను అద్భుతంగా ఇంప్రూవ్ చేస్తాయి.పల్చగా ఉన్న జుట్టును కొద్ది రోజుల్లోనే ఒత్తుగా మారుస్తాయి.జుట్టు రాలడాన్ని అడ్డుకుంటాయి.

చుండ్రు సమస్య( Dandruff )ను నివారిస్తాయి.మరియు ఈ విధంగా హెయిర్ వాష్ చేసుకోవడం వల్ల డ్రై హెయిర్ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.

కురులు సిల్కీగా షైనీ గా మెరుస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube