తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు గుణశేఖర్…( Director Gunasekhar ) ఈయన చేస్తున్న సినిమాలన్నీ కూడా డిజాస్టర్లు గా మిగులుతున్నాయి.అందుకే ఆయన బాగా ఆలోచించి మరి సినిమాలను సెలెక్ట్ చేసుకొని సినిమాలు చేస్తున్నాడు.
ఇక గత సంవత్సరం చేసిన శాకుంతలం సినిమా( Shaakuntalam Movie ) అతనికి భారీగా నష్టాన్ని కూడా తీసుకొచ్చిందనే చెప్పాలి.దాంతో ఆయన రానా ను( Rana ) మెయిన్ లీడ్ గా పెట్టీ హిరణ్యకశప( Hiranyakashyapa ) అనే సినిమా చేద్దామని అనుకున్నాడు.
కానీ రానా ఈ సబ్జెక్ట్ ను వేరే వాళ్ళతో స్టార్ట్ చేయడంతో ఆ ప్రాజెక్టు కూడా తన చేతి నుంచి జారిపోయింది.
దాంతో ఏం చేయాలో అర్థం కానీ గుణశేఖర్ కొద్ది రోజుల పాటు డైలమాలో ఉండి ఇప్పుడు ‘యూఫోరియా’ ( Euphoria ) అనే సినిమాని తెరమీదకి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక దీనికి సంబంధించిన టైటిల్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు.ఈ సినిమాతో గుణశేఖర్ మరోసారి తన స్టామినా ఏంటో చూపించాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.మరి మొత్తానికైతే తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో తన పూర్తి ఎఫర్ట్ పెట్టి వర్క్ చేసి ఈ సినిమాను సక్సెస్ చేసి చూపిస్తాడా లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
ఇక ఈ సినిమాకి తన కూతురు అయిన నీలిమా గుణ( Neelima Guna ) ప్రొడ్యూసర్ గా వ్యవహరించడం విశేషం… ఇక ఈ సినిమాతో ఇప్పటిదాకా వచ్చిన ప్లాప్ లన్నింటికి పులి స్టాప్ పెట్టినట్టుగా తెలుస్తుంది…చూడాలి మరి ఈ సినిమా తో తన ఎంటైర్ కెరియర్ లో ఒక సూపర్ హిట్ కొడతాడా లేదా అనేది…గుణశేఖర్ ఒకప్పుడు చూడాలనిఉంది, ఒక్కడు లాంటి సూపర్ హిట్ సినిమాలను తీశాడు…కానీ ఇప్పుడు మాత్రం ఆ ఫామ్ ను అందుకోవడం లేదు…
.