ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం(Jangareddygudem)మండలం పర్రెడ్డిగూడెంలో విద్యుత్ సబ్ స్టేషన్ షిఫ్ట్ ఆపరేటర్ నిర్వాకం వెలుగులోకి వచ్చింది.విధుల్లో ఉండగా మద్యం సేవించిన షిఫ్ట్ ఆపరేటర్( Shift Operator) ఓ యువతితో కలిసి సబ్ స్టేషన్ లో ఉన్నాడని తెలుస్తోంది.
ఈ మేరకు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిన స్పందించలేదు.స్థానికులు ఎన్నిసార్లు సబ్ స్టేషన్ కు ఫోన్ చేసినా సిబ్బంది పట్టించుకోలేదు.
దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన స్థానికులు సబ్ స్టేషన్ ను ముట్టడించారు.ఈ క్రమంలో షిఫ్ట్ ఆపరేటర్ సబ్ స్టేషన్(sub station) ను వదిలి పరార్ అయ్యాడని సమాచారం.
కాగా షిఫ్ట్ ఆపరేటర్ జీలకర్రగూడెంకు చెందిన వ్యక్తి అని తెలుస్తోంది.