తమ స్కిన్ వైట్‌గా, బ్రైట్‌గా మెరిసిపోవాలనే కోరిక అందరికీ ఉంటుంది.అందుకోసమే స్కిన్ వైటనింగ్ క్రీములను కొనుగోలు చేసి యూజ్ చేస్తుంటారు.
అయితే మార్కెట్‌లో లభ్యమయ్యే క్రీముల వల్ల జేబుకు చిల్లు తప్పితే ప్రయోజనాలు ఏమీ ఉండవు.కానీ, నిమ్మ తొక్కలతో ఇప్పుడు చెప్పబోయే విధంగా సీరమ్‌ను తయారు చేసుకుని వాడితే చక్కగా స్కిన్ టోన్‌ను పెంచుకోవచ్చు.
మరి ఇంకెందుకు లేటు నిమ్మ తొక్కలతో స్కిన్ వైటనింగ్ సీరమ్‌ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండీ.
ముందుగా రెండు నిమ్మ కాయలను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి.
పై తొక్కలను మాత్రం తురుము కోవాలి.ఈ నిమ్మ తొక్కల తురుమును మిక్సీ జార్‌లో కచ్చా ,పచ్చాగా పేస్ట్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఒక కంటైనర్ తీసుకుని అందులో నిమ్మ తొక్కల పేస్ట్, రెండు టేబుల్ స్పూన్లు కొకొనట్ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ రైస్‌బ్రాన్ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు మూత పెట్టేసి ఒక రోజు పాటు కదపకుండా వదిలేయాలి.ఒక రోజు గడిచిన తర్వాత ఈ మిశ్రమాన్ని పల్చటి వస్త్రం సాయంతో ఫిల్టర్ చేసుకుంటే సీరమ్ సిద్ధమైనట్టే.ఒక బాటిల్‌లో ఈ సీరమ్‌ను నింపుకని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు.
ఈ సీరిమ్ వల్ల స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవ్వడమే కాదు మరిన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.
ముఖ్యంగా రాత్రి నిద్రించే ముందు గోరు వెచ్చని నీటితో ఫేష్ వాష్ చేసుకుని.
ఆ తర్వాత ఈ సీరమ్‌ను అప్లై చేయాలి.ఇలా ప్రతి రోజు చేస్తే స్కిన్ టోన్ పెరుగుతుంది.
చర్మంపై ముడతలు, సన్నని గీతలు తగ్గు ముఖం పడతాయి.డ్రై స్కిన్ నుంచి విముక్తి లభిస్తుంది.
మరియు పిగ్నెంటేషన్ సమస్య సైతం దూరం అవుతుంది.