నెల‌స‌రి సమయానికి ర‌క‌పోవ‌డానికి మీకుండే ఈ అల‌వాట్లు కూడా కార‌ణ‌మే..తెలుసా?

నెల‌స‌రి ( Periods )అనేది స్త్రీలలో సంభవించే సహజ శారీరక ప్రక్రియ.రజస్వల అయిన తరువాత ప్ర‌తి నెలా పీరియడ్స్ రావడం అనేది మ‌హిళ‌ల ఆరోగ్యాన్ని సూచిస్తుంది.

 These Habits Are Also The Reason For Not Getting Your Period On Time! Habits, Pe-TeluguStop.com

అయితే ఇటీవ‌ల రోజుల్లో చాలా మంది అమ్మాయిలు ఇర్రెగ్యుల‌ర్ పీరియ‌డ్స్( Irregular periods ) తో ఇబ్బంది ప‌డుతున్నారు.పీసీఓఎస్, థైరాయిడ్ వంటి స‌మ‌స్య‌లు మాత్ర‌మే ఇందుకు కార‌ణం అనుకుంటే పొర‌పాటే.

నిజానికి చాలా అంశాలు నెల‌స‌రిని ప్ర‌భావితం చేస్తాయి.మీకుండే కొన్ని అల‌వాట్లు కార‌ణంగా కూడా నెల‌స‌రి స‌మ‌యానికి రాక‌పోవ‌చ్చు.

ముఖ్యంగా కొంద‌రు జంక్ ఫుడ్ లేదా ప్రాసెస్ చేసిన ఆహారానికి ఎక్కువగా తింటుంటారు.దీని కార‌ణంగా శరీరంలోని హార్మోన్ స్థాయిలు దెబ్బ తింటాయి.

ఫ‌లితంగా ఇర్రెగ్యుల‌ర్ పీరియ‌డ్స్ స‌మ‌స్య త‌లెత్తుంది.కేఫీన్ మరియు ఆల్కహాల్ అధికంగా తీసుకునే అల‌వాటు ఉన్నా కూడా నెలసరి సక్రమంగా రాదు.

Telugu Tips, Latest, Menstrual Cycle, Periods, Habitsperiod-Telugu Health

అలాగే కొంద‌రు వ్యాయామం జోలికి అస్సలు పోరు.ఇంకొంద‌రు వ్యాయామం చాలా అధికంగా చేస్తుంటారు.ఈ రెండు అల‌వాట్లు ప్ర‌మాద‌క‌ర‌మే.అధిక వ్యాయామం చేయడం వల్ల శరీరంలోని శక్తి వినియోగం ఎక్కువై హార్మోన్ల ఉత్పత్తి తగ్గుతుంది.తక్కువ శారీరక శ్రమ వల్ల ఈస్ట్రోజెన్ స్థాయిలు( Estrogen levels ) ఎక్కువగా ఉండి రుతుచక్రానికి అంతరాయం కలిగిస్తుంది.కాబ‌ట్టి, ఎంత అవ‌స‌ర‌మో అంతే వ్యాయామం చేయండి.

రాత్రుళ్లు నిద్ర‌ను నిర్ల‌క్ష్యం చేసే అల‌వాటు ఉంటే వెంట‌నే వ‌దులుకోండి.కంటికి క‌నుకు లేకపోతే హార్మోన్ల ఉత్పత్తి సరిగా జరగదు.

ఇది హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది.దాంతో పీరియడ్స్‌లో మార్పులు వస్తాయి.

Telugu Tips, Latest, Menstrual Cycle, Periods, Habitsperiod-Telugu Health

గర్భనిరోధక మాత్రలు అధికంగా వాడటం వ‌ల్ల‌ నెలసరి సక్రమతను ప్రభావితం చేస్తాయి.చిన్న చిన్న విష‌యానికి కూడా ఒత్తిడి పెంచుకునే వారు ఎంద‌రు.అయితే మానసిక ఒత్తిడి కర్టిసాల్ హార్మోన్‌ను అధికంగా విడుదల చేస్తుంది, ఇది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కు దారి తీస్తుంది.ఇక ఐరన్, విటమిన్ డి,( Iron, Vitamin D ) మరియు బీ-కాంప్లెక్స్ విటమిన్ల లోపం వ‌ల్ల నెల‌స‌రి క్ర‌మం త‌ప్పుతుంది.

అధిక బరువు లేదా త‌క్కువ బరువు క‌లిగి ఉండ‌టం వ‌ల్ల కూడా నెల‌స‌రి స‌మయానికి రాక‌పోవ‌చ్చు.నెలసరి సక్రమంగా రావ‌డానికి పోషకాహారంతో కూడిన ఆహారం తీసుకోండి.ఫైబర్, ప్రోటీన్, మరియు పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోండి.నిద్ర, వ్యాయామం, మరియు మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యం ఇవ్వండి.

తగినంత నీరు తాగండి.శ‌రీర బ‌రువును అదుపులో ఉంచుకోండి.

మ‌రియు నెలసరి చక్రం పర్యవేక్షణకు గైనకాలజిస్ట్‌ను సంప్రదించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube