పంచమహా పాతకాలు అంటే ఏమిటి, అవేంటో మీకు తెలుసా?

పంచ మహా పాతకాలు అంటే ఐదు అతి పెద్ద తప్పులు అని అర్థం.జీవితంలో చేయకూడని తప్పులలో అతి పెద్ద తప్పులను మహాపాతకాలు అంటారు.

 What Is The Pancha Maha Pathakalu, Gurupatni Mahapatahkam , Devotional, Mahapath-TeluguStop.com

ఈ తప్పులను చేయడంతో పాటు వాటిని సమర్థించడం కూడా పాతకం చేసినట్లే అవుతుంది.చాలా మంది తమ వాళ్లు తప్పు చేస్తే ఒకలా… బయటి వారు పాతకం చేస్తే మరోలా ప్రవర్తిస్తుంటారు.

తెలియని వాళ్లు తప్పు చేస్తూ వారి కంట పడితే.వారిలో ఆదర్శ మూర్తిని బయటకు తీసి అణు బాంబు వేసిన వారిని చూసినట్టు చూస్తారు.

అదే తెలిసిన వారు అయితే.చూసీ చూడనట్లు వ్యవహరిస్తుంటారు.

మన వాళ్లే కదా అని దానికి ఓ ట్యాగ్ తగిలిస్తారు.దీని వల్ల సమర్దించిన లేదా తప్పు చేస్తున్నాడని తెలిసి అడ్డుకోక పోయినా తప్పు చేసినట్లే అవుతుంది.

తప్పు చేసిన వారికి కలిగే పాపమే.దానిని సమర్దించిన వారికి , అడ్డుకోలేని వారికి కూడా తగులుతుంది.ఒక పాతకం చేయడం వల్ల వేల జన్మలు దాని చెడు ఫలితాలను అనుభవించక తప్పదని అంటారు పండితులు.అందులోనూ పంచ మహాపాతకాలు మరింత పాపాన్ని మూటగట్టేలా చేస్తాయి.

 పంచ మహా పాతకాలు అంటే బ్రాహ్మణ హత్య మహాపాతకము, సువర్ణ చౌర్య మహా పాతకము, సురాపాన మహాపాతకము, గురుపత్ని సాంగత్యం పాతకము ఈ నాలుగు మహా పాతకమలు.ఇక ఐదోవది ఏమిటంటే… ఈ నాలుగు పాతకాలను సమర్ధించడం ఐదో మహా పాతకం అంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube