ఒక నటుడిగా టాలీవుడ్ లో స్థిరపడాలంటే అంత సులభమైన విషయం కాదు.అందుకు ఎంతో కష్టపడాలి, అయితే ఇవన్నీ జరగాలంటే అవకాశాలు రావాలి.
అయితే వచ్చిన ప్రతి అవకాశాన్ని సరిగా వాడుకుంటేనే ఒక నటుడిగా మంచి పేరు తెచ్చుకోగలరు.అయితే చాలా మంది ఏదో సాధించాలని సినిమా ఇండస్ట్రీ లోకి వస్తారు.
కానీ అక్కడ జరిగే పరిస్థితులకు తట్టుకుని నిలబడగలిగినవారే చక్రం తిప్పగలరు.అలా చాలా చిన్న స్థాయి నుండి ఎలాగైనా నటుడిగా మారాలని వచ్చిన ఒక నటుడి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అతను ఎవరో కాదు సుడిగాలి సుధీర్, ఇతను ఇప్పుడు బుల్లితెరపై ఒక సెన్సేషన్ అని చెప్పాలి.సుధీర్ కు ఉన్న ఫ్యాన్స్ చూస్తే మతిపోతుంది, అంతలా తన కామెడీ టైమింగ్ తో నటనతో అభిమానులను సంపాదించుకున్నాడు.
ఇతను ఈటీవీ లో ప్రతి గురువారం మరియు శుక్రవారం ప్రసారం అయ్యే జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు.
ఈ షో కి ఒక రేంజ్ లో రేటింగ్ వస్తుందంటే అది సుధీర్ పుణ్యమే.
యు ట్యూబ్ లో జబర్దస్త్ షో లో సుధీర్ స్కిట్స్ ని రివైండ్ చేసుకుని చూసే వారు అనేకమంది.అలా అంచెలంచెలుగా ఎదిగి నేడు టాప్ మోస్ట్ కమెడియన్ గా కొనసాగుతున్నాడు.
నేడు జబర్దస్త్ వలన షోలు మరియు సినిమాలలో మంచి మంచి అవకాశాలు దక్కించుకుంటున్నాడు.అయినప్పటికీ తాను ఎంత బిజీ గా ఉన్న తనకు ఇండస్ట్రీలో ఒక దారి చూపించిన జబర్దస్త్ ను మాత్రం వదిలి పెట్టలేదు.
ఇందుకోసం ఈ ప్రోగ్రాం యాజమాన్యం సుధీర్ కు బాగానే ముట్టచెబుతోంది.ఈటీవీలో దాదాపు అన్ని షో లు సుధీర్ మీదనే ఆధారపడ్డాయి అని చెప్పాలి.
అయితే ఇంతలా ఒకవైపు టీవీ షోస్ మరోవైపు సినిమాల్తో బిజీగా ఉన్న సుధీర్ ఒక సంవత్సరానికి ఎంత సంపాదిస్తాడు అన్న విషయం ఎవరికైనా తెలుసా?.

సుధీర్ ఒక సంవత్సరంలో సంపాదన ఇప్పుడు ఉన్న యువ హీరోలు కూడా అంతగా సంపాదించలేరని తెలుస్తోంది.మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ సుధీర్ కు ఒక ఎపిసోడ్ కు రెండు లక్షలు పారితోషికంగా ఇచ్చేవారని సమాచారం.ఈ విధంగా చూసుకుంటే ఒక జబర్దస్త్ ద్వారా ఒక్క సంవత్సరానికి 2 కోట్ల 72 లక్షలు సంపాదిస్తున్నాడు.
ఇక ఈటీవీలో వస్తున్న మరోషో ఢీ ద్వారా ఒక కోటి 36 లక్షలు సంపాదించాడట.ఇక ఆదివారం మాత్రమే ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా రెండు కోట్లు సంపాదిస్తునాడని భోగట్టా.
ఇలా మిగిలిన స్పెషల్ షోస్ అన్నీ కలుపుకంటే ఒక సంవత్సరానికి దాదాపుగా 7 కోట్ల రూపాయలు సంపాదన వస్తున్నట్లు మీడియా సమాచారం.