చాలామంది ప్రజలు అద్దె ఇళ్లలో( Rental House ) జీవిస్తూ ఉంటారు.ఇల్లు అద్దెకు తీసుకున్న ప్రతిసారి ఆఫీస్ నుంచి దూరం, ఆ ఏరియా ఎలా ఉంటుంది.
సౌకర్యాలు మొదలైన వాటిని పూర్తిగా చూసుకుంటూ ఉంటారు.కానీ వాస్తు దోషాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోతూ ఉంటారు.
వాస్తు దోషం( Vastu Dosham ) వల్ల వృత్తి, వ్యాపారాలలో అస్థిరత, కుటుంబ సభ్యులనారోగ్య సమస్యలు పెరగడం, ఆదాయం తగ్గడం లాంటివి జరుగుతూ ఉంటాయి.ఇందుకోసం అద్దె ఇంటిని తీసుకునే ముందు కొన్ని వాస్తు నియమాలను కచ్చితంగా పాటించాలి.
మీరు కూడా ఇల్లు అద్దెకు తీసుకోవాలనుకున్నప్పుడు ఈ నియమాలను తప్పనిసరిగా పాటించండి.వాస్తు అద్భుతంగా లేకపోయినా కనీసం ఈ నియమాలనైనా పాటించాలి.
ఈ నియమాలను పాటించకపోతే ఇంట్లో చాలా రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఇల్లు అద్దెకు తీసుకునే ముందు పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.వంటగది( Kitchen ) ఈశాన్య లేదా నైరుతి దిశలో అసలు ఉండకూడదు.అద్దె ఇంట్లో పడకగది నైరుతి దిశలో ఉండాలి.
అదే సమయంలో ప్రధాన తలుపులు ఉత్తర దిశలో ఉండాలి.ఇంటిని అద్దెకు తీసుకున్నప్పుడు ఈశాన్య దిశలో మరుగుదొడ్డి అసలు ఉండకూడదు.
మరుగుదొడ్డి పడమర వైపు ఉండాలి.కొత్త ఇంట్లో విరిగిన ఫర్నిచర్ మరియు అనవసరపు వస్తువులను అస్సలు ఉంచకూడదు.

అలాగే ఇంట్లో పగిలిపోయిన ఫోటోలు అద్దాలను కూడా బయటపడేయాలి.ఇలాంటి వస్తువులు ఉండటం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తులు వస్తాయి.మీరు ఇల్లు అద్దెకు తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే ముందుగా ఆ ఇంటిలో సానుకూల చిత్రాలు ఉంచండి.దీనికోసం ఇంట్లో పర్వతాలు, సూర్యుడు, జలపాతాల ఫోటోలను ఉంచాలి.ముఖ్యంగా చెప్పాలంటే వాస్తు నిపుణుల ప్రకారం స్మశాన వాటిక, ఆసుపత్రి, ట్రాఫిక్ ప్రాంతం, రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలకు సమీపంలో ఇంటిని అద్దెకు ఎప్పుడు తీసుకోకూడదు.అలాంటి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు వాస్తు దోషాల వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
DEVOTIONAL







