విటమిన్ A లోపిస్తే కళ్ళే కాదు అవి కూడా ఎఫెక్ట్ అవుతాయి.. తెలుసా?

మన శరీరానికి అత్యంత అవసరమైన పోషకాల్లో విటమిన్ A ( Vitamin A )ఒకటి.చాలా మంది విటమిన్ ఎ కంటి ఆరోగ్యానికి మాత్రమే ఉపయోగపడుతుందని అనుకుంటారు.

 What Are The Problems Caused By Vitamin A Deficiency-TeluguStop.com

విటమిన్ ఎ లోపిస్తే కళ్ళు ఎఫెక్ట్ అవుతాయని, కంటి సంబంధిత సమస్యలు తలెత్తుతాయని, కంటి చూపు త‌గ్గుతుంద‌ని భావిస్తారు.కానీ కళ్ళే కాదు విటమిన్ ఎ లోపం వల్ల మరెన్నో ఎఫెక్ట్ అవుతాయి.

ముఖ్యంగా విటమిన్ ఎ లోపం వల్ల ఇమ్యూనిటీ సిస్టం దెబ్బ తింటుంది.

సంతాన సమస్యలు( Parental problems ) తలెత్తుతాయి.

పిల్లల్లో ఎదుగుదల సరిగ్గా ఉండదు.అనేక చర్మ సమస్యలు తలెత్తుతాయి.

ముఖ్యంగా చ‌ర్మం పొడిబార‌డం, నిర్జీవంగా త‌యార‌వ‌డం వంటివి ఇబ్బంది పెడ‌తాయి.అందుకే విటమిన్ ఎ పుష్కలంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.

మరి ఇంతకీ విటమిన్ ఎ మెండుగా ఉండే ఆహారాలు ఏవేవో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Eyes, Tips, Healthy, Latest, Vitamin-Telugu Health

చిలగ‌డదుంప.విటమిన్ ఎ కు పవర్ హౌస్ లాంటిది.రోజుకు ఒక ఉడికించిన చిలగ‌డదుంపను( Sweet potato ) తీసుకుంటే విటమిన్ ఎ తో పాటు మీ శరీరానికి అవసరమయ్యే అనేక పోషకాలు లభిస్తాయి.

ఫైబ‌ర్ సైతం చిల‌గ‌డ‌దుంపులో పుష్క‌లంగా ఉంటుంది.అలాగే గుడ్డులో( egg ) విటమిన్ ఎ రిచ్ గా ఉంటుంది.అందుకే ప్రతి రోజూ ఉదయం ఒక ఉడికించిన గుడ్డు తినమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Telugu Eyes, Tips, Healthy, Latest, Vitamin-Telugu Health

విటమిన్ ఎ కు గొప్ప మూలం క్యాప్సికం.అందులోనూ రెడ్ క్యాప్సికం( Red capsicum ) లో విటమిన్ ఎ చాలా అధికంగా ఉంటుంది.కాబ‌ట్టి, వారానికి రెండు సార్లు అయినా రెడ్ క్యాప్సికం ను తీసుకునేందుకు ప్రయత్నించండి.

విటమిన్ ఎ లోపానికి దూరంగా ఉండాలి అనుకుంటే రోజూ ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ తీసుకోండి.ఇక ఇవే కాకుండా పాలు, బొప్పాయి పండు, ఆకు కూరలు, పెరుగు, చేపలు వంటి ఆహారాల్లోనూ సైతం విటమిన్ ఎ పుష్కలంగా నిండి ఉంటుంది.

కాబట్టి ఈ ఈ ఫుడ్స్ ను డైట్ లో చేర్చుకోండి.విటమిన్ ఎ లోపాన్ని దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకట్ట వేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube