ప్రశాంతమైన నిద్రకు బరువుకు ఉన్న సంబంధం ఏమిటి..? తక్కువ నిద్రపోతే ఏమవుతుందో తెలుసా..?

ప్రస్తుత సమాజంలో మారుతున్న జీవన శైలి వల్ల మన నిద్రలో( Sleep ) కూడా ఎన్నో రకాల మార్పులు వస్తూ ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ల వాడకం, నైట్ షిఫ్టులు ఉండడం, లైఫ్ స్టైల్ మార్పులు కారణంగా చాలామంది నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారు.

 What Is The Relationship Between Restful Sleep And Weight Do You Know What Happ-TeluguStop.com

చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఏదో ఒక కారణం వల్ల తక్కువగా నిద్రపోతున్నారు.దీని వల్ల మన ఆరోగ్యం పై తీవ్రమైన ప్రభావం ఉంటుందనీ నిపుణులు చెబుతున్నారు.

రోజుకు ఏడు గంటలు ప్రశాంతంగా నిద్ర పోకపోతే ఎలాంటి దుష్ప్రభావాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.రాత్రి సమయంలో ఏడు గంటల కంటే తక్కువ నిద్రపోతే బరువు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Telugu Problems, Tips, Immune System, Sleep-Telugu Health Tips

ఎందుకంటే రాత్రి నిద్రపోకపోతే శరీరం ఎక్కువ కేలరీలను ఉపయోగించుకుంటుంది.ఫలితంగా మనకు తెలియకుండానే మనం ఎక్కువగా తింటూ ఉంటాం.ముఖ్యంగా రాత్రిపూట ఎక్కువసేపు మేల్కొనే వాళ్ళు ఏదో ఒకటి తింటూ ఉంటారు.ఇది అధిక బరువును ( Overweight )దారితీస్తుంది.ముఖ్యంగా చెప్పాలంటే నాలుగు గంటల కంటే తక్కువ నిద్రపోతున్న వారిలో దాదాపు పది శాతం అనవసరపు కొవ్వు పెరిగినట్లు కొన్ని అధ్యయనాలలో తెలిసింది.కాబట్టి నిద్రకి బరువుకి సంబంధం ఉంది అని నిపుణులు చెబుతున్నారు.

సరిగ్గా నిద్రపోకపోతే బరువు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. రోగ నిరోధక వ్యవస్థ ( Immune system )మెరుగు పడటానికి ప్రశాంతమైన నిద్ర అవసరమని నిపుణులు చెబుతున్నారు.

గాఢమైన నిద్రలో మీ శరీరం సైటోకిన్‌ లను ఉత్పత్తి చేస్తుంది.

Telugu Problems, Tips, Immune System, Sleep-Telugu Health Tips

ఫలితంగా మన శరీరంలో రోగ నిరోధక శక్తి ( Immune system )పెరిగి ఎన్నో రకాల ఇన్ఫెక్షన్ల నుంచి మన శరీరాన్ని రక్షిస్తుంది.అదే మనం కానీ తక్కువగా నిద్రపోతే సైటోకిన్‌ల ఉత్పత్తి తగ్గి రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది.అందువల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోక తప్పదు.

అందుకోసం ఏడు గంటలకంటే తక్కువ నిద్రపోతే అలసట, గజిబిజిగా మేల్కొంటారు.దీనివల్ల మీ దినచర్యల పైన కూడా ఎంతో ప్రభావం పడుతుంది.

పనులలో సమర్థవంతంగా నిర్ణయాలు తీసుకునే మీ సామర్థ్యాన్ని కోల్పోతారు.కాబట్టి ఇన్ని సమస్యలు ఎదుర్కునే బదులు ప్రశాంతంగా ఏడు గంటలు నిద్రపోతే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube