ముఖ్యంగా చెప్పాలంటే శ్రావణ మాసంలో మహిళలు ఎన్నో రకాల పూజలు, వ్రతాలు చేస్తూ ఉంటారు.అందులో ముఖ్యమైనది వరలక్ష్మీ వ్రతం( Varalakshmi Vratam ) అని ఖచ్చితంగా చెప్పవచ్చు.
శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.వివాహమైన మహిళలు తమ భర్తల శ్రేయస్సు కోసం, సకల సౌభాగ్యాల కోసం అమ్మవారిని పూజిస్తారు.
ఈ సమయంలో ఇంటిని అందంగా అలంకరించడం ఎంతో ముఖ్యం.అయితే కొన్ని కొత్త ఐడియాలతో అమ్మవారిని మీ ఇంటికి స్వాగతించండి.
ముందుగా ఇంట్లోని ప్రతి మూలను శుభ్రం చేసుకోవాలి.అయితే అలంకరణ( Decoration )లో మాత్రం ఎవరికి వారిదే ప్రత్యేకమైన శైలి ఉంటుంది.
ముఖ్యంగా వరలక్ష్మీ వ్రతా( Varalakshmi Vrata )లలో అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.అమ్మవారి అలంకరణ దగ్గర నుంచి పూజ సామాగ్రి, పెట్టే నైవేద్యాలు కూడా ఇంపుగా కనిపిస్తాయి.అందుకే ఈ సమయంలో మీ ఇంటినీ అందంగా అలంకరించేందుకు ఉన్న ఐడియాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే భక్తిశ్రద్ధలతో అమ్మవారిని ఆహ్వానిస్తే మన మీద ప్రేమతో అమ్మవారు ఇంటికి వస్తారు.
కానీ అమ్మవారు ఇంటికి వస్తే మనం ఎంత శుభ్రంగా ఇంటిని సర్దుకోవాలో మనమే నిర్ణయించుకోవాలి.ఎవరైనా అతిధి ఇంటికి వస్తున్నారంటే ఇల్లంతా సర్దుతు ఉంటాము.
అలాంటిది అమ్మవారి అనుగ్రహం కోసం చేసే ఈ వ్రత సమయంలో ఇంటిని ఇంకెంత శుభ్రంగా, అందంగా,ఉంచుకోవడం మీ చేతులలోనే ఉంది.పూజగదిని అలంకరిస్తే సరిపోతుంది కదా అనుకుంటున్నారేమో ఎవరైనా ఇంటికి వస్తే ముఖద్వారం నుంచే లోపలికి వస్తారు.కాబట్టి ఇంటి ప్రవేశ ద్వారన్ని కచ్చితంగా అలంకరించాలి.సాంప్రదాయంగా ముఖద్వారన్ని తీర్చిదిద్దాలనుకుంటే మీరు బంతి పూల దండలు, మామిడి ఆకులు కట్టవచ్చు.లివింగ్ రూమ్ అలంకరణలో కాస్త సృజనాత్మకతను జోడించాలి.మరి హెవీగా వెళ్లకుండా జస్ట్ సింపుల్ గా సింపుల్ ఇన్నోవేటివ్ గా ఉండేలా చూసుకోవాలి.
అలాగే కూర్చునే ప్రదేశాలకు కాస్త పండుగ కల వచ్చేలా ఎలక్ట్రిక్ లైట్స్ తో ట్విస్టు ఇవ్వవచ్చు.వీటన్నిటితో పాటు మీరు చేసే నైవేద్యాలు, పూజ సామాగ్రి ముఖ్యంగా అమ్మవారికి చేసే దీపారాధన, ఇంటికి కొత్తతనాన్ని తీసుకొని వస్తాయి.
ఆలోచిస్తే ఇంకా ఎన్నెన్నో కొత్త చిట్కాలతో మీ ఇంటిని అందంగా ముస్తాబు చేసి అమ్మవారిని స్వాగతించవచ్చు.
DEVOTIONAL