అంబులెన్స్‌కు దారి ఇవ్వకపోవడంతో రూ.2.5 లక్షల చలాన్.. లైసెన్స్ రద్దు(వీడియో)

రోడ్డుపైకి అంబులెన్స్( Ambulance ) వచ్చినప్పుడల్లా ప్రతి ఒక్కరూ దానికి దారి ఇవ్వాల్సిందేనని మనందరికీ తెలిసిన విషయమే.అంబులెన్స్‌లో తీవ్రంగా గాయపడిన లేదా అనారోగ్యంతో ఉన్న రోగి ఉండవచ్చు, అతనికి వీలైనంత త్వరగా చికిత్స అందించాలి.

 Kerala Car Owner Fined And License Revoked For Blocking Ambulance Viral Video De-TeluguStop.com

అందుకే అందరూ ఆలోచించకుండా అంబులెన్స్‌లకు దారిని వదిలివేస్తారు.అయితే ఒక వ్యక్తి ఇలా చేయలేదు.

ఇందుకు సంబంధించిన వీడియో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో( Viral Video ) అంబులెన్స్ ఎదురుగా ఓ కారు( Car ) వెళ్తున్నట్లు కనిపిస్తోంది.అంబులెన్స్ డ్రైవర్ నిరంతరం సైరన్, హారం రెండు కొడుతున్న దారి ఇవ్వలేదు సదరు కారు యజమాని. అయితే, అంబులెన్స్‌ను ముందుకు వెళ్లేందుకు నిరాకరినిచిన కారు డ్రైవర్ తన కారును పక్కకు పోనివ్వకుండా అంబులెన్స్ కు అడ్డంగా వెళ్లడం మొత్తం వీడియోలో రికార్డ్ అయ్యింది.

అంబులెన్స్‌లో కూర్చున్న ఓ వ్యక్తి ఆ వ్యక్తి చేసిన ఈ పనిని వీడియో తీయగా, అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్ చేయగా అది వైరల్ అయ్యి చివరకి పోలీసులకు చేరింది.దానికి సంబంధించిన కొంత సమాచారం సేకరించి, అంబులెన్స్‌కు దారి ఇవ్వనందుకు కేరళ వ్యక్తికి ( Kerala Man ) రూ.2.5 లక్షల చలాన్ జారీ చేయబడింది.దీంతో పాటు అతని లైసెన్స్‌ను కూడా రద్దు చేశారు పోలీసులు.

ఇక వీడియోను చూసిన తర్వాత నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.పెనాల్టీ తోడు కొన్ని నెలల జైలు శిక్ష కూడా జోడించబడాలని కొందరు కామెంట్ చేస్తున్నారు.

మరికొందరు పోలీసులు తగిన బుద్ది చెప్పారని కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube