సాధారణంగా మన హిందువులు నాగ పామును ఎంతో భక్తి భావంతో పూజిస్తారు.మన హిందూ పురాణాలలో కూడా నాగుపాముకి ఎంతో ప్రత్యేకత ఉంది.
ఆ పరమేశ్వరుడు నాగుపామును మెడలో ధరించి ఉంటాడు.అదేవిధంగా నాగుల చవితి రోజు పుట్టలో పాముకు పాలు పోసి భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.
అలాగే విష్ణుమూర్తి సర్ప రాజైన ఆదిశేషువుపై పవళిస్తాడని హిందువుల నమ్మకం.పామును ఎంతో భక్తి భావంతో పూజించే హిందువులు.
పాముని చూడగానే ఆమడ దూరం పరిగెత్తుతారు.కానీ నాగుపాము తల పై నాగమని ఉంటుందని అది కనిపిస్తే ప్రాణాలకు సైతం తెగించి నాగమణినీ సొంతం చేసుకోవడానికి ఎంతో మంది ప్రయత్నిస్తుంటారు.
నాగ పాము తలపై మెరుస్తూ కనిపించేటటువంటి నాగమణి సొంతం చేసుకోవడం వల్ల వారికి ప్రాణాపాయం ఉండదని,అదేవిధంగా వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయని ఎంతోమంది భావిస్తుంటారు.అయితే నిజంగానే పాము తలపై నాగమణి ఉంటుందా? ఆ నాగమణికి నిజంగానే అన్ని శక్తులు ఉంటాయా? లేకపోతే నాగమణి గురించి అంత కట్టుకథ లేనా? అనే విషయం గురించి తెలుసుకుందాం.

నాగమణి గురించి తెలుసుకోవాలంటే పురాణాలను పరిశీలించాల్సి ఉంటుంది.మన పురాణాల ప్రకారం భూగర్భంలో ఏడు లోకాలు ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే.ఈ లోకాలలో ఎన్నో జీవరాసులు నివాసం ఉంటాయి.ఇక పాములకు రాజైన ఆదిశేషుడు తన వేయి తలలతో భూభారాన్ని మోస్తాడని పురాణాలు చెబుతున్నాయి.ఆది శేషుడు, వాసుకి ఇలాంటి పాములన్ని భూగర్భంలోనే నివసిస్తున్నాయి.వీటికి ముఖ్య అనుచరులుగా నాగ పాములు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి.
ఈ నాగుపాముల తలపై నాగమణి ఉంటుందని చాలా మంది భావిస్తుంటారు.
ఇకపోతే నాగమణి గురించి సైన్స్ ప్రకారం ఆలోచిస్తే భూగర్భంలో ఎన్నో ఖనిజాలు దాగి ఉంటాయి.
వాటిలో కొన్ని కాంతిని వెదజల్లుతూ ప్రకాశిస్తూ కనిపిస్తాయి.వాటి కాంతిలోనే పాములు చిన్న చిన్న కీటకాలను వేటాడుతూ ఆహారంగా తీసుకుంటాయి.
ఆ విధంగా కాంతివంతంగా కనిపించే ఖనిజాలనే మనలో చాలా మంది నాగమణిగా భావిస్తుంటారు.నిజానికి నాగమణి అనేది లేదని శాస్త్రీయపరంగా తెలియజేస్తున్నారు.
కానీమన పురాణాలలో ఈ పాముకి ఎంతో ప్రాముఖ్యత ఉండటం వల్ల నాగు పామును భక్తిభావంతో పూజించడం పూర్వం నుంచి ఆనవాయితీగా వస్తోంది.