పాలిచ్చే తల్లి ఆల్కహాల్ తీసుకుంటే శిశువుకి ఎంత ప్రమాదమో చూడండి..

అవగాహన లేమి,అందం పాడవుతుందనే కారణం చేత చాలామంది తల్లులు తమ పిల్లలకు పాలివ్వడానికి నిరాకరిస్తుంటారు.కాని బిడ్డ పుట్టిననాటి నుండి కనీసం ఆర్నెళ్ల పాటు బిడ్డకు పాలివ్వడం అనేది బిడ్డ ఆరోగ్యనికే కాదు,తల్లి ఆరోగ్యానికి కూడా మంచిది.

 Breastfeeding And Drinking Alcohol-TeluguStop.com

అందుకే ప్రభుత్వం తల్లిపాల వారోత్సవాలంటూ ప్రత్యేక కార్యక్రమం చేపట్టి మరీ అవగాహన కల్పిస్తుంది.తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానం అనే విషయం తెలిసిందే.

కాని ఆ అమృతాన్ని ఆల్కహాల్ అనే విషంతో కలిపితే ఎలాంటి ప్రమాదాలుంటాయో తెలుసా… ఆల్కహాల్ స్వీకరించే తల్లి ,తన బిడ్డకు పాలిస్తే తలెత్తే సమస్యలేంటో తెలుసుకోండి.

డెలివరీ అయిన తర్వాత మొదటి కొన్నిరోజుల్లో ఆల్కహాల్ తీసుకోవటం వలన మీ బిడ్డ సహజంగా తీసుకునే తల్లిపాలకన్నా 20% తక్కువ తాగుతాడని అధ్యయనాల్లో తేలింది.

బేబీకి తల్లిపాలే ఏకైక ఆహారం కాబట్టి, ఇలా జరగటం వలన వారి ఆరోగ్యంపై దీర్ఘకాలంలో ప్రభావం పడుతుంది.

తల్లి ఏం తీసుకుంటే అది తల్లిపాలల్లోకి చేరుతుంది .తల్లిపాలల్లో అవసరమైన ముఖ్యపోషకాలన్నీ ఎంత కావాలో అంతలో ఉంటాయి.అయితే ఆల్కహాల్ తీసుకోవడం వలన పోషకాల విలువలు తగ్గుతాయి.

రోజువారీ ఆహారంలో ఆల్కహాల్ ఉండటం వలన ఫోలేట్, ఇతర పోషకాలను పీల్చుకునే శక్తి ఆగిపోతుంది.

తల్లి ఎంత ఆల్కహాల్ తీసుకుంటే అందులో 0.5% నుంచి 3.3% వరకూ తల్లిపాలల్లో చేరుతుంది.0.5,3.3 సంఖ్యలు చిన్నగానే అనిపించోచ్చు.కానీ రెగ్యులర్ గా మద్యం సేవించే తల్లుల విషయంలో వారి పిల్లలపై తీవ్ర ప్రభావం పడుతుంది తల్లిపాలల్లో ఆల్కహాల్ ఉండటం వల్ల పిల్లల్లో తెలివితేటలు తగ్గుతాయి.

బిడ్డ గర్భాశయం నుంచి ప్రపంచంలోకి అడుగుపెట్టాక రోగనిరోధకశక్తి అవసరం.తల్లి ఇచ్చే పాలల్లోని శక్తి వలనే బేబీలు సూక్ష్మజీవులు,వ్యాధులతో పోరాడి ఆరోగ్యంగా ఉండగలుగుతారు.

మెదడులో ఎక్కువ మోతాదులో ఆల్కహాల్ చేరితే అప్పుడే పుట్టిన బేబీకి జీవితకాల హాని జరగవచ్చు.మొట్టమొదటగా భవిష్యత్తులో వీరికే కాలేయ సమస్యలు వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది.

తల్లిపాలల్లో ఆల్కహాల్ ఉండి, అది తాగిన బేబీలు ఎప్పుడూ చిరాగ్గా ఉంటూ, ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు.దీనికి ముఖ్యకారణం ఆ బేబీలు సరిగ్గా నిద్రపోలేరు.ఫలితంగా వారి ఆహారం అలవాట్లు కూడా మారి పరిస్థితులు ఇంకా క్లిష్టంగా మారతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube