మెగా డాటర్ నిహారిక హీరోయిన్‌గా ‘హ్యాపీవెడ్డింగ్’ చిత్రం తెరకెక్కి ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.సుమంత్ అశ్విన్ హీరోగా నటించిన ఈ చిత్రంకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన దక్కింది.
సినిమాలో మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడంతో ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.ఈ చిత్రంతో అయినా కమర్షియల్‌గా నిహారిక సక్సెస్‌ను దక్కించుకుంటుందని అంతా భావించారు.
కాని ఆశించిన స్థాయిలో సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యింది.దాంతో నిర్మాతలు ఈ చిత్రంతో నష్టాలపాలు కాక తప్పదు అని అంతా భావించారు.
కాని అనూహ్యంగా ఈ చిత్రంతో నిర్మాత సేఫ్ జోన్‌లో పడ్డట్లుగా తెలుస్తోంది.
ఈ చిత్రంను యూవీ క్రియేషన్స్ మరియు ప్యాకెట్ సినిమా వారు దాదాపుగా 8 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించడం జరిగింది.
తక్కువ బడ్జెట్ అవ్వడంతో పాటు, ఓపెనింగ్స్ కాస్త పర్వాలేదు అన్నట్లుగా వచ్చిన కారణంగా బడ్జెట్ రికవరీ అయినట్లుగా సమాచారం అందుతుంది.మొదటి వారం రోజుల్లో హ్యాపీ వెడ్డింగ్ చిత్రం దాదాపుగా 4.5 కోట్లను వసూళ్లు చేసింది.ఆ చిత్రానికి సంబంధించిన ఆన్ లైన్ రైట్స్, శాటిలైట్ రైట్స్ ఇతరత్ర రైట్స్ రూపంలో మరో నాలుగు కోట్ల మేరకు నిర్మాతకు ముట్టినట్లుగా తెలుస్తోంది.
భారీ లాభాలు రాకున్నా నిర్మాతలు పెట్టిన పెట్టుబడి రికవరీ అయినట్లుగా తెలుస్తోంది.
డిస్ట్రిబూయటర్లు ఈ చిత్రాన్ని దాదాపుగా అయిదు కోట్లకు కొనుగోలు చేయడం జరిగింది.లాంగ్ రన్‌లో వారి పెట్టుబడి కూడా రికవరీ అవ్వడం ఖాయం అంటూ ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు.భారీ ఎత్తున ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్రయత్నాలు చేశారు.
కాని అనూహ్యంగా ఈ చిత్రానికి పోటీగా సాక్ష్యం విడుదల అవ్వడంతో ఫలితం కాస్త తారు మారు అయ్యింది.పెద్ద సినిమా అయిన సాక్ష్యం లేకుంటే ఖచ్చితంగా డబుల్ వసూళ్లు ఈ చిత్రం నమోదు చేసిది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
నిహారిక బ్రాండ్ నేమ్ కారణంగానే నిర్మాతలు సేఫ్ అయ్యారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
నిహారిక హీరోయిన్‌గా ఇప్పటి వరకు తెలుగులో రెండు, తమిళంలో ఒక చిత్రంలో నటించింది.
ఈ మూడు సినిమాల్లో ఆమె నటనకు మంచి మార్కులు పడుతున్నాయి, కాని ఆమె కెరీర్‌కు ఉపయోగపడే సక్సెస్ మాత్రం దక్కడం లేదు.ఇలాగే కెరీర్ కొనసాగితే నిహారిక హీరోయిన్‌గా కొనసాగక పోవచ్చు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నిహారిక త్వరలో మరో సినిమాకు కమిట్ అవుతుందేమో చూడాలి.సినిమా సినిమాకు నిహారిక చాలా గ్యాప్ తీసుకుంటుంది.
ఒక మనసుతో పోల్చితే హ్యాపీవెడ్డింగ్ విషయంలో ఈ అమ్మడు చాలా సంతోషంగానే ఉందని కొందరు అంటున్నారు.అందుకే నిహారిక వెంటనే కొత్త సినిమా చేయాలని మెగా ఫ్యాన్స్ ఆశపడుతున్నారు.