ఒక నాలుగు రోజులపాటు టూర్ వెళ్లి షిరిడీ నాసిక్ తో పాటు మహారాష్ట్రలోని పర్యాటక ప్రాంతాలు చూడాలనుకుంటున్నారా.అయితే మీకు శుభవార్త.
ఐఆర్‌సీటీసీ టూరిజం( IRCTC Tourism ) హైదరాబాద్ నుంచి ప్రత్యేక టూర్ ప్యాకేజీ ప్రకటించింది.మార్వెల్స్ ఆఫ్ మహారాష్ట్ర( Marvels Of Maharashtra ) పేరుతో ఫ్లైట్ టూర్ ప్యాకేజీని అందిస్తోంది.2023 అక్టోబర్ 15వ తేదీన ఈ టూర్ ప్యాకేజీ మొదలవుతుంది.ఇది మూడు రాత్రులు, నాలుగు రోజుల టూర్ ప్యాకేజీ.
ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకున్న పర్యటకులు షిరిడీ,( Shiridi ) నాసిక్ తో( Nashik ) పాటు ఎల్లోరా ఔరంగాబాద్ లోని పర్యాటక ప్రాంతాలు కూడా చూడవచ్చు.
ఈ టూర్ ప్యాకేజీ కి సంబంధించిన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మహారాష్ట్ర టూర్ ప్యాకేజీ మొదటి రోజు హైదరాబాదులో( Hyderabad ) మొదలవుతుంది.మధ్యాహ్నం 1:50 నిమిషములకు హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కితే, మధ్యాహ్నం మూడు గంటల ఐదు నిమిషములకు షిరిడీ చేరుకుంటారు.సాయంత్రం సాయిబాబా దేవాలయ దర్శనం ఉంటుంది.రాత్రికి షిరిడీలో బస చేయాలి.రెండో రోజు ఉదయం నాసిక్ బయలుదేరాలి.నాసిక్ లో త్రయంబకేశ్వర్ ఆలయాన్ని( Trimbakeshwar Temple ) చూడవచ్చు.

మధ్యాహ్నం పంచవటి దర్శనం కూడా ఉంటుంది.రాత్రికి షిరిడిలో బస చేయాలి.మూడో రోజు ఉదయం శనిశిగ్నాపూర్ బయలుదేరాలి.శనీశ్వర దేవాలయాన్ని సందర్శించాలి.ఆ తర్వాత ఎల్లోరా గుహలు, ఘృష్ణేశ్వర్ దేవాలయం చూడవచ్చు.రాత్రికి ఔరంగాబాద్ లో( Aurangabad ) బస చేయాలి.
నాలుగో రోజు బీబీ కా మక్బారా సందర్శన ఉంటుంది.ఆ తర్వాత సాయంత్రం 6:10 నిమిషాలకు ఔరంగాబాద్ లో ఫ్లైట్ ఎక్కితే, రాత్రి 7 గంటల 30 నిమిషాలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ పూర్తవుతుంది.

ఐఆర్‌సీటీసీ మార్వెల్స్ ఆఫ్ మహారాష్ట్ర టూర్ ప్యాకేజీ ధర చూస్తే ఒకరికి ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.20,950, ఆక్యుపెన్సీకి రూ 21, 200, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.25,550 చెల్లించాలి.టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, హోటల్ బస, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, బ్రేక్ ఫాస్ట్, డిన్నర్, ట్రావెల్ ఇన్సూరెన్స్ కవర్ అవుతాయి.ఐఆర్‌సీటీసీ మార్వెల్స్ ఆఫ్ మహారాష్ట్ర టూర్ ప్యాకేజీ బుక్ చేయడానికి https://www.irctctourism.com/ వెబ్సైట్ ఓపెన్ చేసి, హోమ్ పేజీలో టూర్ ప్యాకేజెస్ పైన క్లిక్ చేసి మార్వెల్స్ ఆఫ్ మహారాష్ట్ర లింక్ పై లాగిన్ అయి బుక్ చేసుకోవాలి.







