సాధారణంగా చాలా మంది వారి ఇంట్లో ఎన్నో రకాల ఆర్థికపరమైన ఇబ్బందులు, లేదా మానసిక ఆందోళనలు అనారోగ్య సమస్యలు వంటి వాటితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు.ఈ క్రమంలోనే ఈ విధమైనటువంటి ఇబ్బందులతో బాధపడేవారు ఈ సమస్యల నుంచి బయట పడటం కోసం ఎన్నో పరిహారాలు పాటిస్తూ ఉంటారు.
ఇలా ఎన్ని పరిహారాలు పాటించినప్పటికీ కొందరికి ఇంటికి పట్టిన దరిద్రం మాత్రం వదలదు నిత్యం ఏదో ఒక సమస్య వారిని వెంటాడుతూనే ఉంటుంది.
ఇలా నిత్యం సమస్యలతో సతమతమయ్యేవారు ఈ చిన్న పరిహారం పాటించడం వల్ల మన ఇంట్లో సమస్యలకు చెక్ పెట్టడం కాకుండా ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం కూడా తొలగిపోతుంది.
మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వ్యాపించకుండా ఉండాలంటే ప్రధాన ద్వారం ఎంతో పరిశుభ్రంగా ఉండాలి అలాగే ఏ విధమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా ఉండాలంటే గడప దగ్గర తప్పనిసరిగా ఈ నియమాలు పాటించాలి.ప్రతిరోజు ఉదయం గడప లోపలి వైపున ఒక రాగిచెంబులో నీటిని తీసుకొని అందులోకి పచ్చ కర్పూరం, ఐదు కాయిన్స్, ఎర్రటి పుష్పం, వట్టివేర్ల గుత్తిఉంచాలి ఇలా గుమ్మం లోపల వైపులా ప్రతిరోజు పెట్టడం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ బయటకు తొలగిపోతుంది.
ప్రతిరోజు ఉదయం ఆ నీటిని మారుస్తూ యధావిధిగా ఈ వస్తువులను పెట్టడం వల్ల ఏ విధమైనటువంటి దరిద్రం తొలగిపోతుంది.అదేవిధంగా గుమ్మం బయట వైపు దీపం వెలిగించాలి.ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఈ విధంగా దీపం వెలిగించడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోవడమేకాకుండా ఏ విధమైనటువంటి సమస్యలు లేకుండా ఉంటాయని పండితులు చెబుతున్నారు.ఇలా మన ఇంట్లో ఉన్న దరిద్రం తొలగించడానికి ఈ పరిహారం ఎంతో చక్కటి పరిష్కార మార్గం అని చెప్పవచ్చు.